ఒకప్పుడు హట్రిక్ హీరోగా కెరీర్ లో యమ జోరు మీదున్న కుర్ర హీరో రాజ్ తరుణ్ పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది, మినిమమ్ గ్యారెంటీ హీరో అంటూ జూనియర్ రవితేజ అంటూ అందరి చేత కితాబులు అందుకున్న ఈ కుర్ర హీరో స్టొరీ సెలెక్షన్ విషయం లో చేసిన తప్పుల వలన బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఓపెనింగ్స్ ని కూడా అందు కోలేని పరిస్థితి ని ఇప్పుడు సొంతం చేసు కున్నాడు.
బాక్స్ ఆఫీస్ దగ్గర దిల్ రాజు లాంటి ప్రేస్టీజియస్ బ్యానర్ లో సినిమా అంటే ఆడియన్స్ లో మంచి బజ్ ఉంటుంది, అలాంటిది ఎలాంటి బజ్ లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ఇద్దరి లోకం ఒకటే రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో డిసాస్టరస్ అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కేవలం 16 లక్షల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది ఈ సినిమా.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 20 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నట్లు సమచారం. ఇక సినిమా సాధించిన బిజినెస్ ని అఫీషియల్ గా అయితే ఇంకా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్క ప్రకారం 1.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు.
దాంతో 1.5 కోట్ల రేంజ్ టార్గెట్ లో 20 లక్షలు రికవరీ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, రెండో రోజు అన్ని సెంటర్స్ లో ఫస్ట్ డే కన్నా 40% డ్రాప్స్ కనిపిస్తున్నాయి. దాంతో ఇక సినిమా తేరుకునే అవకాశమే లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.