Home న్యూస్ డిస్కోరాజా రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

డిస్కోరాజా రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా మంచి అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కాగా సినిమా పై హైప్ బాగానే ఉన్నా రిలీజ్ కి ముందు రోజు 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ అనుకుంటే ఫైనల్ గా రిలీజ్ రోజు కేవలం 400 థియేటర్స్ లోనే రిలీజ్ అయింది. ఇక ప్రీమియర్ షోలకు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోల రెస్పాన్స్ తెలుసుకుందాం పదండీ..

Disco Raja Pre Release Business Worldwide!!

కథ పాయింట్ కి వస్తే…. హీరో చనిపోయిన తర్వాత తనపై ఒక ప్రయోగం చేస్తారు, దాంతో తానూ తిరిగి బ్రతుకుతాడు… ఇంతకీ తను ఎలా చనిపోయాడు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి… ఫ్లాష్ బ్యాక్ తెలుసు కున్న తర్వాత ఏం చేశాడు అన్నది స్టొరీ పాయింట్.

కథ పాయింట్ సింపుల్ రివెంజ్ బ్యాగ్ డ్రాప్ లో తెరకక్కినా దానికి సైంటిఫిక్ నేపధ్యం లో కలరింగ్ ఇచ్చారు. పూర్తిగా అదే కాన్సెప్ట్ తో సినిమా ముందుకు సాగిపోయి ఉంటె బాగుండేది కానీ ఒక దశ దాటాకా రెగ్యులర్ రొటీన్ మూవీ గా మారిపోతుంది.

Disco Raja Total Theaters, Advance Bookings, Day 1 Collections Predictions

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ కుమ్మేశాడు, ఒకప్పటి వింటేజ్ రవితేజ ని మళ్ళీ రీ లోడ్ చేసినట్లు తను స్క్రీన్ పై వచ్చిన ప్రతీ సారి ఆడియన్స్ రీచార్జ్ అవుతారు. హీరోయిజం సీన్స్ తన డైలాగ్ మాడ్యులేషన్..అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఇక హీరోయిన్స్ జస్ట్ ఒకే అనిపించే నటనే కనబరిచారు.

ఇక సునీల్, వెన్నెల కిషోర్ కొంచం మెప్పించాగా విలన్ గా చేసినా బాబీ సింహా పర్వాలేదు అనిపిస్తాడు. మిగిలిన నటీనటులు ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్.. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే మరో లెవల్ లో ఉందని చెప్పాలి.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు ఓకే కానీ సెకెండ్ ఆఫ్ సగం తర్వాత పూర్తిగా ఫ్లాట్ అయిపోతుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్షన్ పరంగా వి ఐ ఆనంద్ డిఫెరెంట్ కాన్సెప్ట్ ని తీసుకుని సైంటిఫిక్ టచ్ ఇచ్చినా అది కొద్ది సేపే…

తర్వాత పూర్తిగా రెగ్యులర్ మూవీ గా మారిపోయిన సినిమా అక్కడక్కాడా కొన్ని ట్విస్ట్ లు టర్న్ లతో మెప్పించాగా రవితేజ తన స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు, అవి తప్పితే సినిమా లో పెద్దగా మ్యాటర్ లేనట్లే అనిపించింది. ఓవరాల్ గా సినిమా లో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే..

రవితేజ పెర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ సీన్, ఓపెనింగ్ సీన్, సెకెండ్ ఆఫ్ మొదటి 25 నిమిషాలు… అని చెప్పాలి, ఇక మైనస్ పాయింట్స్ లో రొటీన్ కథ, వీక్ సెకెండ్ ఆఫ్… రెగ్యులర్ క్లైమాక్స్ అని చెప్పాలి… మొత్తం మీద రవితేజ వింటేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు.

Disco Raja Pre Release Business Worldwide!!

మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ [2.5 స్టార్స్]... సినిమా మరీ అద్బుతం కాదు, అలా అని మరీ ఉట్టిదే అని తీసి వేయలేం, కొన్ని మూవ్ మెంట్స్ మెప్పిస్తాయి, రవితేజ రాఫ్ఫాడించాడు. దాని కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు అనే విధంగా ఉంది డిస్కోరాజా సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here