మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు షాక్ ఇచ్చింది, సినిమా అంచనాలను మించుతుంది అనుకుంటే, అంచనాలను కూడా అందుకోలేక పోయింది. దానికి ప్రధాన కారణం సరిపడినన్ని థియేటర్స్ ని సినిమా కి కేటాయించక పోవడమే అని చెప్పాలి. రీసెంట్ టైం లో ఒక స్టార్ హీరో సినిమా కి 400 వరకు థియేటర్స్ మాత్రమె దక్కడం ఒక్క డిస్కోరాజా విషయం లోనే జరిగింది అని చెప్పాలి.
దానికి తోడూ ఆడియన్స్ ఇంకా సంక్రాంతి మూవీస్ హ్యాంగోవర్ లోనే ఉన్నారని క్లియర్ అయింది. సంక్రాంతి సీజన్ లో మిస్ అయిన వాళ్ళు వీకెండ్ లో ఆ మూవీస్ నే ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే రవితేజ ప్రీవియస్ మూవీస్ ఎఫెక్ట్ కూడా డిస్కోరాజా పై పడి ఉంటుందని చెప్పాలి.
కారణాలు ఏవి అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కు ముందు పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకున్న డిస్కోరాజా మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 3.2 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అనుకుంటే 2.54 కోట్లు అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో వసూల్…
చేస్తుంది అనుకుంటే మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
?Nizam: 1.08Cr
?Ceeded: 36L
?UA: 31L
?East: 19L
?West: 15L
?Guntur: 17L
?Krishna: 18L
?Nellore: 10L
AP-TG Total:- 2.54CR
Ka & ROI: 0.22Cr
OS: 0.13Cr
Total WW: 2.89Cr( 5.1Cr Gross )
సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 19.2 కోట్లకు అమ్మగా 20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ డే నే షాక్ ఇచ్చింది. ఇక మిగిలిన రన్ లో సినిమా మరో 17.11 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సినిమా రెండో రోజు కూడా 1.5 కోట్ల నుండి 1.7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి…