సంక్రాంతి సినిమాల తర్వాత మరో హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ కి ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో దక్కిన మంచి ఎంటర్ టైనర్ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి హాలిడే రోజున రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ కొంచం స్లో గా మొదలు అయినా మ్యాట్నీ షోల నుండి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది, సినిమా మొదటి 2 షోలకు…
ఓవరాల్ గా 40% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా… ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 60 టు 65% రేంజ్ ఓవరాల్ ఆక్యుపెన్సీ తో రన్ అవుతూ ఎక్స్ లెంట్ గ్రోత్ ని సొంతం చేసుకుంది, కొన్ని సెంటర్స్ లో అయితే…
70% కి పైగా ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకున్న ఈ సినిమా సెకెండ్ షోలకు కూడా జోరు తగ్గకుండా పెంచుకుంటూ దూసుకు పోతుంది, దాంతో ఇప్పుడు సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్లకు తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అవి ఫైనల్ గా ఎంతవరకు వెళతాయి అనేది… కొన్ని సెంటర్స్ లో…
శివరాత్రి కానుకగా మిడ్ నైట్ షోలు కూడా వేయడం తో అవి కూడా కలిపి లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 5.7 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఓవరాల్ గా సినిమా అదిరి పోయే ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకోబోతుంది. ఇక ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగితే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ లో సగానికి పైగా రికవరీ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొదటి రోజు కి గాను సినిమా అఫీషియల్ గా ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.