Home న్యూస్ “హిట్” మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

“హిట్” మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఫలక్ నుమా దాస్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని సమర్పణ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “హిట్” బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు వరల్డ్ వైడ్ గా 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుని డీసెంట్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు రెగ్యులర్ షోల తర్వాత ఫైనల్ గా ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే…. హీరో పోలిస్ ఆఫీసర్… తన పాస్ట్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వలన తనకు అప్పుడప్పుడు మెంటల్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి టైం లో ఒక అమ్మాయ్ మిస్సింగ్ కేస్ వస్తుంది, తర్వాత కో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన హిరోయిన్ కూడా…

మిస్ అవుతుంది, తర్వాత ఏం జరిగింది, హీరో ఎలా వీళ్ళ ని కనిపెట్టాడు, అసలు వీళ్ళని మిస్ అయ్యేలా చేసింది ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ వన్ మ్యాన్ షో గా సినిమా ని చెప్పుకోవచ్చు.

మిగిలిన పాత్రలకు చాలా తక్కువ స్క్రీన్ టైం ఉండగా ఎక్కువ శాతం విశ్వక్ సేన్ స్క్రీన్ స్పేస్ దొరకగా ప్రతీ సీన్ లో తన నటనతో మెస్మరైజ్ చేశాడు హీరో. మెంటల్ స్ట్రోక్స్ వచ్చిన సీన్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇలా ప్రతీ సీన్ లో తన నటన మెప్పిస్తుంది. హీరోయిన్ రుహానీ కూడా ఉన్నంతలో..

తన నటనతో మెప్పిస్తుంది, మిగిలిన రోల్స్ కి పెద్దగా ఇంపార్టెంట్స్ లేదు, ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విశేషం లో వివేక్ సాగర్ కుమ్మేశాడు, ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ని చాలా వరకు ఎంగేజింగ్ గా చేస్తుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు చాలా బాగుండగా సెకెండ్ ఆఫ్ లో గాడి తప్పింది.

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ భారీ గా ఉండగా మరీ లో బడ్జెట్ లో తీసిన ఫీలింగ్ అస్సలు కలిగించకపోవడం విశేషం. ఇక డైరెక్షన్ పరంగా శైలేష్ కొలను ఎంచుకున్న పాయింట్ ని ఫస్టాఫ్ వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చెప్పి మెప్పించాడు. సెకెండ్ ఆఫ్ ని కూడా బాగానే మొదలు పెట్టినా…

ఒక స్టేజ్ దాటాకా బోర్ కొట్టడం మొదలు పెడుతుంది, తిరిగి ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ ఊపు పెంచినా ప్రేక్షకులు ఆశించిన మేర క్లైమాక్స్ ని తెరకెక్కించలేక సింపుల్ గా ముగించడం కొద్దిగా నిరాశని మిగిలిస్తుంది. కొంచం బెటర్ గా సెకెండ్ ఆఫ్ అండ్ క్లైమాక్స్ ని రాసుకుని ఉంటె సినిమా మరో లెవల్ లో ఉండేది.

మొత్తం మీద ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఫస్టాఫ్, కొన్ని ఎక్స్ లెంట్ ట్విస్ట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇక మైనస్ పాయింట్స్ కి వస్తే… సెకెండ్ ఆఫ్ మిడిల్ లో చాలా స్లో అవ్వడం, క్లైమాక్స్ వీక్ గా ఉండటం లాంటివి మైనర్ మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

ఓవరాల్ గా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అవ్వడం తో చాలా వరకు ఎంగేజింగ్ గా నే ఉన్నా, సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా డ్రాగ్ అవ్వడం, సినిమా లో ఉన్న ఎమోషనల్ పాయింట్ అంత కనెక్ట్ అయ్యేలా లేకపోవడం మరియు క్లైమాక్స్ జస్ట్ ఓకే అనిపించేలా ఉండటం తో ఫస్టాఫ్ ఇచ్చిన కిక్…

మూవీ అయ్యాక మర్చిపోతారు, ఇలాంటి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారు “హిట్” సినిమా చాలా వరకు మెప్పించే అవకాశం ఉంది, ముందే చెప్పినట్లు సెకెండ్ ఆఫ్ కొంచం బెటర్ గా డీల్ చేసి ఉంటె మరో లెవల్ లో ఉండేది సినిమా… ఫైనల్ గా సినిమా కి మా రేటింగ్ [2.75 స్టార్స్]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here