టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్.ఆర్.ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు అనుకున్నట్లే అన్నీ జరిగితే జులై30 న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఈ ఇయర్ మొదట్లోనే సినిమా వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అవుతుందని యూనిట్ అఫీషియల్ గా కన్ఫాం చేసిన విషయం తెలిసిందే.
ఇక సినిమా ఇప్పుడు కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన మరోసారి పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం అన్న టాక్ గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఇలాంటి టైం లో యూనిట్ నుండి వినిపిస్తున్న స్ట్రాంగ్ న్యూస్ ప్రకారం సినిమా ఎట్టి పరిస్థితులలో కూడా…
అనుకున్న సమయానికే వచ్చే అవకాశం ఉందట. కరోనా ఎఫెక్ట్ ఉన్నా 2 నెలలు షూటింగ్ కి గ్యాప్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని యూనిట్ చెబుతుందట. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి సినిమా రిలీజ్ డేట్ పై ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది చూపే అవకాశం లేదని చెప్పొచ్చు. ఈ లెక్కన వచ్చే ఇయర్ సంక్రాంతి బరిలో ఈ సినిమా సంచలనం సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.