Home న్యూస్ వారంలో కొత్త రికార్డ్…ఆల్ టైం రికార్డ్ ట్రెండ్ ఇది!!

వారంలో కొత్త రికార్డ్…ఆల్ టైం రికార్డ్ ట్రెండ్ ఇది!!

0

     రెండు మూడు రోజుల క్రితమే టాలీవుడ్ లో సినిమాల యానివర్సరీ ల ట్రెండ్ లో సరికొత్త రికార్డ్ నమోదు అయింది, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మహేష్ నటించిన భరత్ అనే నేను వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర 2 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా భారీ ఎత్తున ట్రెండ్ చేయగా 24 గంటల్లో టోటల్ గా 2.75 మిలియన్స్ కి అటూ ఇటూ గా ట్వీట్స్ ని పోల్ చేసి రికార్డ్ కొట్టారు.

ఇప్పుడు ఆ రికార్డ్ పట్టు మని వారం కూడా మారక ముందే బ్రేక్ అయింది, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చాలా రోజులకు ఫుల్ యాక్టివ్ అవ్వగా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ లైకుడ్ లవ్ స్టొరీ అయిన డార్లింగ్ వచ్చి…

10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున ట్రెండ్ ని చేపట్టగా 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ ట్వీట్స్ తో మహేష్ ఫ్యాన్స్ నెలకొల్పిన రికార్డ్ ని బ్రేక్ చేసి ఏకంగా 4 మిలియన్స్ కి అటూ ఇటూ గా ట్వీట్స్ ని పోల్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు.

ఒకసారి టాప్ యానివర్సరీ ట్రెండ్స్ ని గమనిస్తే
1) #DecadeForClassicDarling – 4Mil~
2) #2YEARSforBharatAneNenu-2.75M~
3) #DecadeForMemorableAarya2: 1.21M
4) #9YrsOfCultClassicORANGE: 831K
5) #8YrsForIHDookuduSensation: 676K
6) #1YearForVeeraRaghavaRage: 530K
7) #1YearforClassicJERSEY – 391.6K
8) #12YearsOfBBYamadonga: 353K
9)#4YearsForసరైనోడు: 347K
10) #4YearsForCultTEMPER: 325K
11) #7YearsForIHDookudu: 243K
12) #4YrsForWarriorGonaGannaReddy – 226k
13) #3YrsOfTemperExplosion – 210K
ఇవీ ప్రస్తుతానికి టాప్ లో నిలిచిన సినిమాల యానివర్సరీ ట్రెండ్స్…

మొత్తం మీద ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సరికొత్త యానివర్సరీ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేయగా తర్వాత వచ్చే రోజుల్లో మహేష్ ఫ్యాన్స్ పోకిరి ట్రెండ్ ని తర్వాత పవన్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ట్రెండ్ ని ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ రికార్డులు ఎలా ఉంటాయో కొన్ని రోజుల్లో తెలుస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here