టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే, స్పైడర్ మరియు బ్రహ్మోత్సవం సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ షాక్ ఇచ్చినా వెంటనే భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ తో యమ జోరు మీదున్న సూపర్ స్టార్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ ని కమిట్ అయ్యే పనిలో ఉన్నాడు.
తన అప్ కమింగ్ మూవీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31 న మొదలు కాబోతుంది, డైరెక్టర్ గా ఆల్ మోస్ట్ గీత గోవిందం ఫేమ్ పరశురం కన్ఫాం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది రాబోతుంది అన్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ చేయబోతున్నాడు. టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో తన అప్ కమింగ్ మూవీ ఉంటుందని చెప్పగా ప్రస్తుతం ఆ సినిమా కథను లాక్ డౌన్ లో సిద్ధం చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లకపోయినా 2021 ఎండింగ్ లో కానీ 2022 స్టార్టింగ్ లో కానీ సెట్స్ పైకి వెళుతుంది జక్కన్న మూవీ కాబట్టి కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ఉండటం ఖాయం. రీసెంట్ మూవీస్ పాటర్న్ ని గమనిస్తే ప్రతీ సినిమా కి మినిమం రెండున్నర ఏళ్ళు గ్యాప్ ఉంది.
ఈ లెక్కన మహేష్ సినిమా కనుక ఓకే చేస్తే అప్ కమింగ్ తర్వాత మహేష్ తర్వాత సినిమా వెండితెరపై ఆడియన్స్ చూడాలి అనుకుంటే 2024 వరకు మినిమం ఆగక తప్పదు అనే చెప్పాలి. కానీ రాజమౌళి తో సినిమా కాబట్టి అప్పటికి ఓ అద్బుతమైన సినిమా అందించే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి మహేష్ 2 ఏళ్లకి పైగా గ్యాప్ ఇస్తే ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి…