మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఫాం విచిత్రంగా ఉందని ఉందని, కెరీర్ మొదలు పెట్టడం సాలిడ్ హిట్స్ తో హాట్రిక్ కొట్టి మొదలు పెట్టగా తర్వాత వరుస పెట్టి డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ వచ్చే వరకు ఈ ఫ్లాఫ్స్ పరంపర ఆగలేదు, తర్వాత లాస్ట్ ఇయర్ ఎట్టకేలకు చిత్రలహరి సినిమా తో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ని సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ అదే ఇయర్ ఎండ్ లో…
ప్రతీ రోజు పండగే అంటూ వచ్చి బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు, ఈ సినిమా 34 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించి డౌన్ ఫాల్ అయిన కెరీర్ కి తిరిగి తిరుగులేని బూస్టప్ ఇచ్చింది, ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ…
సమ్మర్ లో రావాల్సిన సాయి ధరం తేజ్ లాక్ డౌన్ వలన ఆ సినిమా ను పోస్ట్ పోన్ చేయగా ఇప్పుడు వరుస పెట్టి 2 మల్టీ స్టారర్ మూవీస్ లో భాగం కాబోతున్నాడు అన్నది ఇండస్ట్రీ టాక్. అందులో ఒకటి మాస్ మహారాజ్ రవితేజ నేను లోకల్ ఫేం త్రినాద రావ్ నక్కిన…
డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లో ఓ ఎక్స్ టెండెడ్ క్యామియో చేయబోతున్న సాయి ధరం తేజ్ తర్వాత యూత్ స్టార్ నితిన్ తో కలిసి చేయబోతున్నాడట. 14 రీల్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇద్దరు హీరోల తో ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంటున్నారు.
లాక్ డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా లు రెండూ మల్టీ స్టారర్స్ అవ్వడం తో ఈ సినిమాలతో సాయి ధరం తేజ్ ఎంతవరకు తన మార్క్ ని చూపెడతాడు అన్నది ఆసక్తిగా మారింది, ఈ రెండు కొత్త సినిమా లు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని అంటున్నారు…