బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మంచి స్టార్ట్ లభించినా కానీ సమ్మర్ రెట్టించిన జోరు తో దుమ్ము లేపుతాయి అనుకున్నా లాక్ డౌన్ వలన సినిమా లు అన్నీ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో ఎప్పుడు వస్తాయో అన్న ఆసక్తి అందరి లోనూ ఉంది, ఇక ఈ లాక్ డౌన్ టైం లో థియేటర్స్ బంద్ అవ్వడం తో కొత్త సినిమాలు చూడాలి అనుకున్న వాళ్ళకి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఒక్కటే మార్గం అవ్వగా,
OTT యాప్స్ కూడా జనాల కోసం కొత్త సినిమాలు కొని రిలీజ్ చేయాలని ట్రై చేశాయి కానీ చాలా క్రేజీ సినిమాలు మాత్రం థియేటర్స్ లోనే సినిమాలు రిలీజ్ చేస్తామని చెప్పుకోచ్చాయి. ఇక డిజిటల్ రిలీజ్ కి చాలా కొన్ని సినిమాలు మాత్రమే ఒప్పుకోగా..
ముందుగా టాలీవుడ్ నుండి అమృతరామం సినిమా రిలీజ్ అవ్వగా సినిమా కి బిలో యావరేజ్ టాక్ లభించింది, ఇక తర్వాత నవదీప్ నటించిన రన్ సినిమా కూడా పెద్దగా ప్రచారం లేకుండానే రిలీజ్ అవ్వగా ఆ సినిమా కి కూడా బిలో యావరేజ్ టాక్ లభించింది.
ఇక తమిళ్ లో జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొన్మగల్ వందాన్ సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమా కి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ లభించింది. ఓవరాల్ గా డిజిటల్ రిలీజ్ లో ఈ మూడు నోటబుల్ మూవీస్ రిలీజ్ అవ్వగా ఒక్కటి కూడా నికార్సయిన హిట్ టాక్ ని మాత్రం అందుకోలేదు.
దాంతో OTT ప్లాట్ ఫామ్స్ కూడా ఒక్క నికార్సయిన బ్లాక్ బస్టర్ పడితే జనాలు ఎక్కువ సంఖ్య లో మరింతగా డిజిటల్ రిలీజ్ లను చూడటానికి ఇష్టపడతారని భావిస్తున్నారు. మరో 2 నెలల వరకు పెద్దగా థియేటర్స్ తెరచుకునే అవకాశం లేకపోవడం తో మిగిలిన సినిమాల్లో అయ్యినా ఒక్క సూపర్ హిట్ మూవీ దొరక్క పోతుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ఆ సినిమా ఏది అవుతుందో చూడాలి…