నందమూరి అభిమానులకు ఎప్పటి నుండో ఒక కోరిక, అది నట సింహం బాలయ్య మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ రావాలి అని, కానీ రీసెంట్ టైం లో ఈ హీరోలు ఒకరంటే ఒకరి కి పడని పరిస్థితి లోనే ఉన్నారు, ముఖ్యంగా బాలయ్య కొంత కాలం ఎన్టీఆర్ ని దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే, కానీ హరికృష్ణ గారి మరణం తర్వాత…
అదే బాలయ్య తిరిగి ఎన్టీఆర్ ని దగ్గరకు తీసుకున్నాడు, అప్పటి నుండి ఇద్దరు హీరోలు అడపా దడపా స్టేజ్ పైన కలిసి కనిపించారు, దాంతో తిరిగి వీరి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ పడాలి అని ఫ్యాన్స్ ఆశ పడటం మొదలు పెట్టగా ఈ ప్రశ్న ని బాలయ్య ని ఎవరూ అడగలేదు.
కానీ రీసెంట్ గా బర్త్ద్ ఏ సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చిన బాలయ్య ప్రతీ ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంభందించిన ప్రశ్న లతో పాటు ఎన్టీఆర్ తో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు అన్న ప్రశ్న కూడా క్రమంగా ఎదురు అయింది.
బాలయ్య కూడా ఎన్టీఆర్ తో కలిసి చేయాలనే ఉందని, కానీ సరైన కథ దొరకలేదు, ఇది వరకు కూడా ట్రై చేసిన కథ కుదరక వదిలేశామని, ఫ్యూచర్ లో అయినా మంచి కథ దొరికితే కచ్చితంగా మేం కలిసి చేస్తామని కన్ఫాం చేశాడు, ఇంకా చెబుతూ ఒక్క ఎన్టీఆర్ తోనే కాదని, మంచి కథ ఉంటే తాను అందరు హీరోలతో కూడా కలిసి చేయడానికి సిద్ధమే అని చెప్పుకొచ్చాడు.
ఇక రాజకీయాల్లో ఎన్టీఆర్ పాత్ర గురించి కూడా ప్రశ్నలు అడగ్గా, ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో బిజీ గా ఉన్నాడని, రాజకీయాలకు అవసరాల కోసం రాకూడదని, సేవ కోసం వస్తేనే రాణిస్తారని, ఎన్టీఆర్ అలా సిద్ధపడినప్పుడు కచ్చితంగా రాజకీయాల్లో కూడా రాణిస్తాడని చెప్పుకొచ్చాడు బాలయ్య. మొత్తం మీద నందమూరి ఫ్యాన్స్ వీరి బాండింగ్ కి ఫిదా అవుతున్నారని చెప్పొచ్చు.