టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుండి ఒక్క అపజయం లేకుండా కెరీర్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం అరవింద సమేత తో తన కెరీర్ బెస్ట్ రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ తర్వాత మొత్తం సమయాన్ని ఆర్ ఆర్ ఆర్ కోసమే కేటాయించాడు. ఇప్పుడు మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ కోసం మూడేళ్ళ టైం కేటాయించబోతున్నాడు కరోనా ఎఫెక్ట్ వలన.
వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తర్వాత చేయాల్సిన సినిమాలు కూడా కరోనా ఎఫెక్ట్ వలన లేట్ అవుతున్న విషయం తెలిసిందే, ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా “అయినను పోయి రావలె హస్తినకు” అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ పాటికే రెగ్యులర్ షూటింగ్ లో ఉండాల్సిన సినిమా ఇప్పుడు కరోనా వలన దసరా కి మొదలు కాబోతుండగా ఈ సినిమా కథ పాయింట్ కొద్దిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి సినిమా కథని పోలి ఉంటుందని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.. కానీ ట్రీట్ మెంట్ మాత్రం….
మొత్తం త్రివిక్రమ్ స్టైల్ లో ఉంటుందని అంటున్నారు… ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి తెలియాల్సి ఉండగా ఎన్టీఆర్ రోల్ ఇందులో బిజినెస్ చేసే వ్యక్తీ అనుకోని కారణాల వల్ల పొలిటికల్ లీడర్ లా మారాల్సి ఉంటుందని ఆ లుక్ మొత్తం మాసీగా కద్దరు చొక్కాలతో మాస్ టచ్ ని కలిగి ఉంటుందని అన్న వార్తలు శిఖారు చేస్తున్నాయి.
దానికోసమే రీసెంట్ గా కాస్ట్యూమ్ టెస్ట్ ని ఎన్టీఆర్ తో ఫోటో సెషన్ లో భాగంగా చేశారని అంటున్నారు. ముఠా మేస్త్రి ఫుల్ మాస్ మూవీ… త్రివిక్రమ్ ఇప్పటి వరకు ఫుల్ మాస్ మూవీ అయితే చేయలేదు, అరవింద సమేత లో ఫస్ట్ 20 నిమిషాల్లో మాత్రం తనలో ఉన్న మాస్ డైరెక్టర్ రేంజ్ చూపాడు, ఇప్పుడు అది సినిమా మొత్తం చూపితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ తన రేంజ్ చూపడం ఖాయమని చెప్పొచ్చు.