టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని తన నంబర్ 1 ప్లేస్ ఎప్పుడూ తనదే నని మళ్ళీ నిరూపించుకున్నారు. ఖైదీ నంబర్ 150 టాలీవుడ్ న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలవగా సైరా నరసింహా రెడ్డి కూడా తెలుగు వర్షన్ వరకు సాలిడ్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఇక ఇప్పుడు కంబ్యాక్ తర్వాత చేస్తున్న మూడో సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో….
ఉన్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కానీ షూటింగ్ డిలే తో పాటు ఈ కరోనా ఎఫెక్ట్ రెండూ కలిసి ఈ సినిమా షూటింగ్ పై ఎఫెక్ట్ పడగా సినిమా నిరవధికంగా డిలే అవుతూనే ఉంది.
ఇక ఆడియన్స్ ముందుకు కూడా ఎప్పుడు వస్తుంది అన్నది క్లారిటీ లేదు, ఇక ఈ సినిమా లో మెగాస్టార్ రెండు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు అన్న టాక్ నిన్న మొన్నటి దాకా వినిపించింది కానీ అసలు విషయం కాదని తెలుస్తుంది, అసలు మ్యాటర్ ఏంటి అంటే సినిమా లో మెగాస్టార్ ఇప్పుడు…
డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు.. ఫస్టాఫ్ లో ఒక రోల్ అలాగే సెకెండ్ ఆఫ్ లో మరో రోల్ ఉంటుందని అంటున్నారు. వీటికి తోడూ స్పెషల్ రోల్ ఉండగా ఆ రోల్ లో రామ్ చరణ్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు చేస్తాడు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేకుండా పోయింది.
సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉండగా వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అనుకున్నా కానీ అది జరిగేలా లేక పోవడం తో సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ రేసు లో నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు…