కెరీర్ లో తొలి 40 కోట్ల సినిమా తో ఫుల్ జోష్ మీద ఉన్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మరో సూపర్ హిట్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న లవ్ స్టొరీ పక్కా సూపర్ హిట్ మెటీరియల్ అని ఇన్ సైడ్ టాక్. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య చేయబోయే సినిమా ముందు పరశురాం ది అనుకున్నా మహేష్ తో ఆఫర్ తో…
కొంత గ్యాప్ రానుంది. కాగా సడెన్ గా రేసులోకి వచ్చిన డైరెక్టర్ విక్రం కే కుమార్. అక్కినేని ఫ్యామిలీ కి మనం లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చిన డైరెక్టర్ లాస్ట్ రెండు సినిమాలుగా పెద్దగా ఫాం లో లేడు. హలో, గ్యాంగ్ లీడర్ అంచనాలను…
పూర్తిగా అందుకోలేక పోయాయి. కాగా నాగ చైతన్య తో మూవీ కమిట్ అయినా కానీ చెప్పిన కథలు ఏవి నచ్చలేదట. ఓవరాల్ గా విక్రం కుమార్ 3 డిఫెరెంట్ కథలను నాగ చైతన్య కి వినిపించగా ఒక్కటి కూడా నచ్చిందని నాగ చైతన్య చెప్పలేదని ఇండస్ట్రీ టాక్. తర్వాత సడెన్ గా సీన్ లోకి…
ఎంటర్ అయ్యాడట దిల్ రాజు…. స్టొరీ కాలేదు కాబట్టి తన దగ్గర ఉన్న కథని నాగ చైతన్య కి వినిపించి ఓకే చేయించగా ఆ కథ ని ఇప్పుడు విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తారు అన్న టాక్ ఉంది. దానికి కొన్ని విక్రం కుమార్ మార్పులు చేర్పులు చేయబోతున్నారట. తర్వాత సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం…
3 కథలు చెప్పి నచ్చక ఇక కాన్సిల్ అవుతుంది అనుకున్న టైం లో దిల్ రాజు ఇటు హీరో ని అటు డైరెక్టర్ ని కలిపారు అంటున్నారు. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టొరీ కొన్ని రోజుల షూటింగ్ మాత్రమె బాలెన్స్ ఉండగా ఇయర్ ఎండ్ కి గాని సంక్రాంతి కి గాని ఆడియన్స్ ముందుకు రావొచ్చు అంటున్నారు. తర్వాత ఈ సినిమా మొదలు కానుందట…