సరిగ్గా 11 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ ను చీల్చి చెండాడుతూ సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ ఎస్ రాజమౌళి లో కాంబినేషన్ లో వచ్చిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మగధీర రిలీజ్ అయ్యింది. నేటి తో సినిమా రిలీజ్ అయ్యి 11 ఏళ్ళు పూర్తి అవ్వగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ చేయగా 24 గంటల్లో ఫ్యాన్స్ దుమ్ము లేపారు.
మరీ కొత్త రికార్డులు నమోదు కాక పోయినా కానీ టాప్ 4 బిగ్గెస్ట్ మూవీ యానివర్సరీ ట్రెండ్ ని నమోదు చేసి సత్తా చాటుకున్నారు. ఇక 11 ఏళ్ల మగధీర విశేషాలలోకి వెళితే అప్పట్లోనే ఏకంగా 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో 45 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ ని సాధించి…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే 5.95 కోట్లు, మొదటి వీకెండ్ 14 కోట్లు, మొదటి వారం 20.5 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకున్న ఈ సినిమా మొదటి వారం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో 41 కోట్లు అధికంగా వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. 50 రోజుల వేడుకను 286 సెంటర్స్ లో అలాగే…
100 రోజుల వేడుకను 223 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకుని రికార్డ్ సృష్టించిన ఈ ఎపిక్ బ్లాక్ బస్టర్ 2009 టైం లో ఇండియా లో బిగ్గెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమాగా నిలిచి పాత రికార్డ్ హోల్డర్ అమీర్ ఖాన్ గజినీ 68 కోట్లు, శివాజీ 67 కోట్ల రికార్డ్ బ్రేక్ చేసి 73 కోట్ల కి పైగా షేర్ తో రికార్డులకెక్కింది.
ఇంతటి రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా వచ్చి 11 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ 24 గంటల్లో 5.4 మిలియన్స్ ట్వీట్స్ వేయగా ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని అందుకున్నారు. మొదటి ప్లేస్ లో గబ్బర్ సింగ్ ట్రెండ్ లో 13.4M, రెండో ప్లేస్ లో సింహాద్రి ట్రెండ్ లో 8.8M, మూడో ప్లేస్ లో పోకిరి ట్రెండ్ లో 8.5M ట్వీట్స్ తో టాప్ 3 లో కొనసాగుతున్నాయి.