మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్య ఫాం లో లేడన్న విషయం అందరికీ తెలిసిందే, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ అవుతూ రవితేజ బాక్స్ ఆఫీస్ మార్కెట్ పై గట్టి ప్రభావం చూపగా ఈ ఇయర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా కూడా అంచనాలను అందుకోలేక డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి టైం లో తన ఆశలన్నీ ఇప్పుడు మరోసారి క్రాక్ మూవీ మీదే పెట్టుకున్నాడు.
ఈ సినిమా పరిస్థితులు సద్దుకున్నాక ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం, ఇక వచ్చే ఏడాది మాత్రం రవితేజ మాస్ రాంపేజ్ చూడటం ఖాయం అని అంటున్నారు. ఒకప్పుడు రవితేజ ప్రతీ ఏడాది మినిమమ్ 3 నుండి 4 సినిమాలు చేస్తూ దుమ్ము లేపేవాడు.
అందులో కచ్చితంగా 2 హిట్ మూవీస్ గ్యారెంటీగా ఉండటం తో తనని మినిమమ్ గ్యారెంటీ హీరో అనేవాళ్ళు, కానీ తర్వాత ఇయర్ కి ఒకటి ఎప్పుడో కానీ రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్న రవితేజ ఈ సారి మళ్ళీ తన మునుపటి ఫామ్ ని అందుకునేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు మూడు సినిమాలతో రాబోతున్నాడని సమాచారం… ముందు రమేష్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా, దాంతో పాటు త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో ఎంటర్ టైనర్, తర్వాత తన కి లేటెస్ట్ గా డిస్కో రాజా సినిమా తో డిసాస్టర్ ఇచ్చిన వి ఐ ఆనంద్ తో కూడా సినిమా కమిట్ అయ్యాడట రవితేజ.
ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఇయర్ లోనే రిలీజ్ అవ్వాలని, ఇక ఇయర్ కి రెండు మూడు సినిమాలు మినిమమ్ చేయాలని రవితేజ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఒకవేళ క్రాక్ ఈ ఎడారి రాకుంటే, వి ఐ ఆనంద్ మూవీ 2022 లో వస్తుందని, వచ్చే ఏడాది మాత్రం 3 రిలీజ్ లు పక్కగా ఉంటాయని ఇండస్ట్రీ లో ఇప్పుడు చెప్పుకుంటున్నారు…