టీసర్ ట్రైలర్ రిలీజ్ తో ఊహకందని హైప్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయ్యి ట్రైలర్ ఇచ్చినంత హైప్ ను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను తప్పిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా ఐ మనోహరుడు… అయినా కానీ విక్రం పడ్డ కష్టానికి ఒక్కసారైనా చూసి తీరాలి అని అందరూ ఈ సినిమా చూడటం తో టార్గెట్ లో చాలా వరకు రికవరీ చేసింది.
కానీ టెలివిజన్ లో మాత్రం టెలికాస్ట్ చేయడానికి భారీ రేట్లు చెప్పడం తో సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదు, 2015 లో రిలీజ్ అయిన ఐ మనోహరుడు సినిమా 5 ఏళ్ళు అలాగే ఉండి పోయి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ వాళ్ళు…
సుమారు 4.2 కోట్ల రేంజ్ రేటు చెల్లించి సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా సినిమా టెలికాస్ట్ చేసినా కేవలం రెండు రోజులు నామ మాత్రపు పబ్లిసిటీ చేసినప్పటికీ కూడా సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సాలిడ్ TRP రేటింగ్ దక్కడం విశేషం అనే చెప్పాలి.
సినిమాకి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు రీసెంట్ గా 11.13 TRP రేటింగ్ దక్కింది. 5 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టెలికాస్ట్ అయ్యి పెద్దగా పబ్లిసిటీ లాంటిది లేకున్నా కానీ సాలిడ్ రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఐ మనోహరుడు సినిమా. టేకింగ్ పరంగా శంకర్ నిరాశ పరిచినా కానీ విక్రం పడ్డ కష్టం కోసం…
ఈ సినిమా ను మరొక్క సారి గుర్తు చేసుకుని ఆడియన్స్ చూడగా సినిమా కి మంచి రేటింగ్ దక్కింది, సినిమా ను ఇప్పుడు అమ్మిన రేటు ప్రకారం చూసుకుంటే ఓవరాల్ గా సినిమా తక్కువ పబ్లిసిటీ తోనే మంచి రేటింగ్ ని అందుకుందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విక్రం నికార్సయిన హిట్ కోసం ఇప్పటికీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే జరగాలని మనం కోరుకుందాం…