సోషల్ మీడియా లో ఇది వరకు పెద్దగా ట్రెండ్స్ కానీ హీరోల ఫాలోవర్స్, లైక్స్ లాంటివి పెద్దగా పట్టించుకునే వారు కాదు, కానీ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా లోకి రావడం తో స్టార్స్ ఫాలోవర్స్ లైక్స్ లాంటివి భారీగా పెరిగి పోతున్నాయి. ఇంటర్నెట్ మరింత విస్తారంగా అందరికీ అందుబాటులోకి రావడం తో ఇవన్ని సాధ్యం అవుతుండగా టాలీవుడ్ ఫ్యాన్స్ ట్రెండ్స్ విషయం లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా…
ఇక హీరోలు వేసిన ట్వీట్స్ కి ఈ మధ్య అవలీలగా 1 లక్ష లైక్స్ ని అందిస్తూ దుమ్ము లేపుతున్నారు… టాలీవుడ్ రీసెంట్ టైం లో ఒకటి తర్వాత ఒకటి ఇలా హీరోల ట్వీట్స్ కి 1 లక్ష లైక్స్ చాలా సింపుల్ గా వచ్చేస్తున్నాయి. కాగా ఇది ఎన్టీఆర్ తో మొదలు అవ్వగా తర్వాత…
మిగిలిన స్టార్స్ అందరికీ వారు వేసిన ట్వీట్ సందర్భాన్ని బట్టి లైక్స్ రావడం జరుగుతూ వచ్చింది. ఓవరాల్ గా ఈ రోజు వరకు టాలీవుడ్ స్టార్స్ 1 లక్ష లైక్స్ కౌంట్ ని చూసుకుంటే మహేష్ బాబు ఇప్పుడు 7 సార్లు 1 లక్ష లైక్స్ ట్వీట్స్ ని సొంతం చేసుకుని టాప్ లో ఉన్నాడు.
ఇక రెండో ప్లేస్ లో ఎన్టీఆర్ 5 సార్లు 1 లక్ష లైక్స్ ని అందుకుని దుమ్ము లేపగా లేటెస్ట్ గా తన మ్యారేజ్ పోస్టులతో 1 లక్ష లైక్స్ ని మూడు సార్లు మొత్తం మీద సొంతం చేసుకుని రానా మూడో ప్లేస్ లో ఉండగా పవన్ కళ్యాణ్ 2 సార్లు ఈ మార్క్ ని ఓవరాల్ గా అందుకున్నాడు.
ఇక రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్న నితిన్ 2 సార్లు ఈ మార్క్ ని అందుకోగా అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లు ఒక్కో సారి ఈ మార్క్ ని అందుకుని ఈ లిస్టులో నిలిచారు. సౌత్ మొత్తం గమనిస్తే… దళపతి విజయ్ 18 సార్లు ఈ మార్క్ ని అందుకుని ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. మన వాళ్ళు ఈ విషయంలో కొంచం కాన్సన్ ట్రేట్ చేయాల్సి ఉంది..