అనుకున్నట్లే టాలీవుడ్ ఫస్ట్ బిగ్ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసింది. నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కుతున్న వి ది మూవీ లో సుదీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంచి అంచనాల నడుమ సమ్మర్ రేసు లో నిలవాల్సిన ఈ సినిమా ఇయర్ ఎండ్ కి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కానుంది.
ఈ విషయానికి నాని అఫీషియల్ గా రీసెంట్ గా అప్ డేట్ చేయగా రిలీజ్ డేట్ ని ఇవాళ అప్ డేట్ చేశారు. తన మొదటి సినిమా రిలీజ్ అయిన సెప్టెంబర్ 5 నే ఇప్పుడు తన 25 వ సినిమా రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు. ఇక సినిమా బిజినెస్ మారింది ఇప్పుడు.
అమెజాన్ ప్రైమ్ ముందు 33.4 కోట్ల రేటు ని ఫైనల్ చేయగా నిర్మాత దిల్ రాజు థియేటర్స్ ఓపెన్ చేశాక ఒక వారం 10 రోజులు థియేట్రికల్ రిలీజ్ చేయిస్తే ఈ రేటు మాకు ఓకే అని చెప్పగా, దానికి ప్రైమ్ ఒప్పుకోక పోవడం తో బిజినెస్ మరింత పెంచి ఫైనల్ గా….
మరో 2 కోట్లు పెంచి 35.4 కోట్లకి డీల్ ని ఫినిష్ చేశారని సమాచారం. OTT బిజినెస్ కన్ఫాం అవ్వగా ఇక సినిమా శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇంకా అమ్ముడు పోవాల్సి ఉంది. మొత్తం మీద సినిమా కి మంచి బిజినెస్ దక్కింది అని చెప్పాలి. రీసెంట్ గా నాని సినిమాల యావరేజ్ బిజినెస్ 32 కోట్ల రేంజ్ లో ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో థియేటర్స్ ఓపెన్ అయినా బయ్యర్లు అంత రేటు పెడతారో లేరో చెప్పలేం కాబట్టి ఈ రేటు ని కన్సిడర్ చేసి సినిమాను డైరెక్ట్ గా సెప్టెంబర్ 5 న రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఇండియా లో సినిమా సెప్టెంబర్ 4 న రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం కాబోతుందని సమాచారం…