Home న్యూస్ ఎట్టకేలకు RRR పై జక్కన్న కామెంట్స్…రిలీజ్ ఎప్పుడు, ఎన్టీఆర్ లుక్ ఎప్పుడంటే??

ఎట్టకేలకు RRR పై జక్కన్న కామెంట్స్…రిలీజ్ ఎప్పుడు, ఎన్టీఆర్ లుక్ ఎప్పుడంటే??

0

టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్… సినిమా మొదలు అయ్యి ఆల్ రెడీ రెండేళ్ళు అవ్వగా వచ్చే ఇయర్ సంక్రాంతి కి సినిమా రిలీజ్ అనుకున్నా కానీ.. కరోనా ఎఫెక్ట్ తో అన్ని షూటింగ్ లు ఆగిపోవడం తో ఈ సినిమా కూడా ఆగిపోయింది.

రీసెంట్ గా కరోనా భారీన పడి కరోనా ని జయించిన జక్కన్న లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమా గురించిన కొన్ని విశేషాలు తెలియజేశారు. ముందుగా సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్న ప్రశ్న కి… డాక్టర్లు ఇక ఎలాంటి ఇబ్బంది లేదు…

మీరు షూటింగ్లు చేసుకోండి అని ఎప్పుడు చెబితే అప్పుడే షూటింగ్ మొదలు అవుతుందని, అలాగే షూటింగ్ తిరిగి మొదలు అయిన 6-7 నెలల్లో సినిమా ని రిలీజ్ చేస్తామని డేట్లు మాత్రం ఇప్పుడు చెప్పలేమని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇక సినిమా లో ఎన్టీఆర్ లుక్ ఎప్పుడు రిలీజ్…

అన్న ప్రశ్నకి రామ్ చరణ్ బర్త్ డే కి ముందే ఫూటేజ్ షూట్ చేశామని, ఎన్టీఆర్ బర్త్ డే కి టైం ఉందని ఆగడం తో షూట్ చేయలేక పోయామని, ఇప్పుడు తిరిగి షూటింగ్ లకు వెళ్ళే అవకాశం లేక పోవడం తో ముందు చెప్పినట్లే డాక్టర్లు ఇక ఏం ఇబ్బంది లేదు అని చెప్పక మేం షూటింగ్ ని మొదలు పెడతామని…

మొదలు పెట్టిన 10-15 రోజుల్లో ఎన్టీఆర్ లుక్ ని, ఇంట్రో టీసర్ ని రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు జక్కన్న. మొత్తం మీద ఫ్యాన్స్ ఇన్నాళ్ళ వెయిటింగ్ ని మరింత పొడగించేలా కామెంట్స్ చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇది తప్ప వేరే దారి లేదని కూడా క్లారిటీ ఇచ్చారు జక్కన్న.. ఇయర్ ఎండ్ కి పరిస్థితులు సద్దుకుంటే అప్పుడు ఎన్టీఆర్ లుక్, సినిమా షూటింగ్ తిరిగి మొదలు అవుతాయి అన్నమాట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here