కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి బిజినెస్ రేంజ్ ఉన్న హీరో లలో సూర్య కూడా ఒకరు. ఒకప్పుడు ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ ని ఎంజాయ్ చేసిన సూర్య సరైన హిట్స్ పడక మెల్లి మెల్లిగా తన మార్కెట్ కోల్పోయాడు కానీ మంచి హిట్ పడితే ఇక్కడ కూడా తిరిగి సాలిడ్ కలెక్షన్స్ ని అందు కోగల సత్తా సూర్య కి ఎంతైనా ఉందని చెప్పొచ్చు.
రీసెంట్ మూవీస్ అన్నీ ఫ్లాఫ్ అయినా అంచనాలను అందుకోక పోయినా కానీ తన లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దుగా సినిమా తో మరోసారి సత్తా చాటుకున్నాడు సూర్య. ఈ సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి సిద్ధం అయిన విషయం అందరికీ తెలిసిందే.
సినిమా తమిళ్ తెలుగు మలయాళం మరియు కన్నడ డబ్బింగ్ వర్షన్స్ అన్నీ కలిపి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కింద ఏకంగా సౌత్ లోనే రికార్డ్ లెవల్ లో 65 కోట్ల రేటు దక్కించుకోగా… సినిమా అన్ని భాషల శాటిలైట్ రైట్స్ అలాగే మ్యూజిక్ రైట్స్ కింద మరో 40 కోట్ల రేంజ్ లో ఓవరాల్ బిజినెస్…
జరిగిందని, దాంతో టోటల్ బిజినెస్ లెక్క ఇప్పుడు 105 కోట్ల మార్క్ ని అందుకుందని యూనిట్ కన్ఫాం చేశారు. దాంతో ఫ్లాపుల్లో ఉన్నా కూడా మరో సారి 100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ని సొంతం చేసుకుని సూర్య తన మాస్ పవర్ ని మరోసారి చూపెట్టాడు. అదే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే యావరేజ్ గా థియేట్రికల్ బిజినెస్…
60 కోట్ల రేంజ్ లో…స్ట్రీమింగ్ రైట్స్ 15 కోట్ల రేంజ్ లో….శాటిలైట్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ 40 కోట్ల రేంజ్ లోనే ఉండేవి…అవి టోటల్ కలిపితే…115 కోట్ల రేంజ్ బిజినెస్ ఓవరాల్ గా జరిగేది, ఆ లెక్కతో పోల్చితే ఓ 10 కోట్ల మేర నష్టపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో ఇది సాలిడ్ బిజినెస్ అనే చెప్పాలి. ఇక సినిమా అక్టోబర్ 30 న డైరెక్ట్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే…