ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ లో అల్టిమేట్ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర తన కెరీర్ లో మొదటి సారి 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ బెస్ట్ ఫాం ని అందుకున్న టైం లో తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం సినిమాను తెలుగు లో రెడ్ పేరు తో రీమేక్ చేయగా….
సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోగా మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా డిజిటల్ రిలీజ్ కోసం మాసివ్ ఆఫర్స్ రావాడం మొదలు పెట్టాయి, ముందు 22 కోట్ల నుండి మొదలైన ఆఫర్లు అలా అలా పెరుగుతూ 28 కోట్ల దాకా కూడా వెళ్ళగా…
మేకర్స్ మాత్రం చివరి రేటు కి టెంప్ట్ అయినా కానీ ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ రామ్ భావించగా నిర్మాత నో చెప్పాడు, కానీ తర్వాత సీన్ మారింది, వి మూవీ డిజిటల్ రిలీజ్ కన్ఫాం చేసుకోవడం తో అన్ని సినిమాలకు రేట్లు తగ్గడం మొదలు అయ్యింది.
ఇదే సమయం లూ రెడ్ నిర్మాత స్రవంతి రవికిషోర్ కూడా రామ్ ని కన్విన్స్ చేసి మంచి రేటు కి ఓకే చెబుతామని చెప్పడం తో రామ్ ఓకే అనగా డిజిటల్ రేటు అమాంతం తగ్గించేసి ఇప్పుడు 21 కోట్ల రేంజ్ రేటు ఇస్తామని చెబుతున్నారట OTT యాప్స్ వాళ్ళు. అప్పుడు 28 అన్నారు కదా అంటే… ఇప్పుడు మార్కెట్ ప్రకారం రేటు ఇది అనడం తో…
ఇక రామ్ కి ఈ మ్యాటర్ తెలిసి, సినిమాన థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దామని ఇన్ని రోజులు ఆగాం, మరి కొన్ని రోజులు ఆగి థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దామని, డిజిటల్ రిలీజ్ వద్దని చెప్పారట. దాంతో రామ్ రెడ్ మూవీ ప్రస్తుతానికి డిజిటల్ రిలీజ్ జరగడం కష్టమే అంటున్నారు, ఒకవేళ రేటు పెరగడమో, నిర్మాత హీరో కాంప్రమైజ్ అయితే తప్పితే రెడ్ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని అంటున్నారు…