కెరీర్ స్టార్టింగ్ ని సాలిడ్ గానే స్టార్ట్ చేసినా తర్వాత ఎంచుకున్న సినిమాల ఫలితాల వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకుని ఏకంగా మార్కెట్ నే కోల్పోయే స్టేజ్ కి వచ్చాడు యంగ్ హీరో రాజ్ తరుణ్, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాకపోవడం తో ఒక నికార్సయిన హిట్ వేటలో ఉన్న రాజ్ తరుణ్ గుండెజారి గల్లంతైందే, ఒక లైలా కోసం ఫేం…
విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో హెబ్బ పటేల్ మరియు మాళవిక నైర్ ల కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా మీద మంచి ఆశలు పెట్టుకోగా సమ్మర్ రేసు లో నిలవాల్సిన ఈ సినిమా కరోనా వల్ల పోస్ట్ పోన్ అవ్వగా సినిమాకు…
రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీస్ తో సంభందం లేకుండా మంచి OTT ఆఫర్స్ వచ్చినా అప్పుడు నో చెప్పి తర్వాత రేట్లు పూర్తిగా తగ్గిన తర్వాత ఆల్ మోస్ట్ సగం రేటుకే ఆహా వాళ్ళు సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కింద సినిమాకు..
మరో మంచి బిజినెస్ జరిగింది అని చెప్పాలి. సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను జీ తెలుగు వాళ్ళు సుమారు 1.8 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు. రీసెంట్ రాజ్ తరుణ్ మూవీస్ రేట్లు 1.2 కోట్ల రేంజ్ లో అమ్ముడు పోగా ఈ సారి 60 లక్షల దాకా రేటు అధికంగా దక్కించుకుంది ఈ కొత్త సినిమా.
దాంతో ఓవరాల్ గా ఇప్పుడు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కలిపి సినిమా బిజినెస్ 5.8 కోట్ల రేంజ్ లో జరిగినట్లు సమాచారం. ఇక మ్యూజిక్ రైట్స్ హిందీ డబ్బింగ్ రైట్స్ వివరాలు తెలియాల్సి ఉండగా అవన్నింటితో కలిపి నిర్మాత కి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక సినిమా అక్టోబర్ 2 న డైరెక్ట్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.