రాఘవ లారెన్స్ హీరోగా నటించిన సినిమాల్లో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించిన సినిమా లలో కాంచన సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే, ప్రతీ సినిమా మిక్సుడ్ టాక్ తోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోగా కాంచన సినిమా ను ఇప్పుడు హిందీ లో ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ పేరు తో రీమేక్ చేయగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా వలన ఇప్పుడు….
డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని నవంబర్ 9 న సొంతం చేసుకోబోతుంది, సినిమా ను 125 కోట్ల రేటు చెల్లించి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హక్కులను సొంతం చేసుకోగా ఈ రోజు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మనం ఆల్ రెడీ కాంచన మూవీ చూసి ఉన్నా కానీ…
లక్ష్మీ బాంబ్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. స్టొరీ కాన్సెప్ట్ ని బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు మార్చి హీరో ఫ్యామిలీ లేకుండా హీరోయిన్ ఫ్యామిలీ కి షిఫ్ట్ చేసి కామెడీ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ని అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ అలరించింది.
రాఘవ లారెన్స్ కొన్ని సీన్స్ మరో లెవల్ లో చేయగా అక్షయ్ కుమార్ అది మ్యాచ్ చేయక పోయినా తన వరకు తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు, బాలీవుడ్ వరకు ఇది ఎక్కువే అని చెప్పాలి. సినిమా మెయిన్ స్టొరీ పాయింట్ అలానే ఉంచి బ్యాగ్ డ్రాప్ ని లొకేషన్ ని చేంజ్ చేసినట్లు ట్రైలర్ లో తెలుస్తుంది.
ట్రైలర్ చూసిన తర్వాత సౌత్ ఆడియన్స్ మన లారెన్స్ బాగా చేశాడు అనుకోవడం ఖాయం కానీ బాలీవుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసుకుంటే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే అక్షయ్ కుమార్ ప్రజెంట్ వరుస హిట్స్ తో ఉండటం తో అవలీలగా 200 కోట్లను అందుకోవడం ఏమాత్రం కష్టం అయ్యేది కాదు, కానీ పరిస్థితుల వలన ఇప్పుడు ఇండియా లో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా…