టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎపిక్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్.. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి కి భారీ గా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అయింది. ఇక రీసెంట్ గా మళ్ళీ షూటింగ్ మొదలైన ఈ సినిమా…
గురించిన ఒక స్ట్రేంజ్ రూమర్ ఒకటి ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, అది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియదు కానీ… ఆ రూమర్ ప్రకారం సినిమా రషెస్ ని చూసుకున్న జక్కన్న లెంత్ మళ్ళీ ఎక్కువ అవుతుంది అని గమనించి ఒక నిర్ణయం తీసుకున్నారట.
బాహుబలి లా ఈ సినిమా ని కూడా 2 పార్టులుగా చేస్తే ఎలా ఉంటుంది, ఒక పార్ట్ ని వచ్చే ఇయర్ మరో పార్ట్ ని 2022 లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేయడం అది ఇటు ఎన్టీఆర్ కి అటు రామ్ చరణ్ కి వినిపించడం జరిగిందట.
కానీ ఇప్పటికే చాలా సమయం కేటాయించడం తో ఇద్దరు హీరోలు కూడా ఈ ప్రపోజల్ కి నో చెప్పారు అంటూ ఇండస్ట్రీ లో వార్తా బాగా ట్రెండ్ అవుతుంది, అది సోషల్ మీడియా కి కూడా పాకింది. రాజామౌలి ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో క్లియర్ గా… ఈ సినిమా కేవలం 1 పార్ట్ మాత్రమే ఉంటుందని చెప్పారు…
సో ఈ న్యూస్ చాలా వరకు రూమర్ అయి ఉండొచ్చని అంచనా వేయవచ్చు…. ఒకవేళ నిజం అనుకున్నా హీరోలు ఇద్దరూ ఎలాగు ఇంత టైం కేటాయించి ఇంకో ఒక్క ఏడాది టైం ఇవ్వడానికి వెనకాడరు కాబట్టి ఇందులో నిజం లేదని అంటున్నారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ ని ఈ నెల 22 న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.