ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ఆల్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్… అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమా రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా వచ్చే సంక్రాంతి కి అనుకున్నా కరోనా వలన పోస్ట్ పోన్ అయిన సినిమా ఇప్పుడు సమ్మర్ రేసు లో నిలిచిన విషయం తెలిసిందే.
ఇక సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ ని త్వరలో రిలీజ్ చేయబోతుండగా సినిమా కి సంభందించిన మరో హాట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ వార్తలు నిజం అయితే ఆల్ ఇండియా లెవల్ లో బిగ్గెస్ట్ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని…
సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు…. ఆల్ ఇండియా లెవల్ లో ఇది వరకు రోబో 2.0 సినిమా అన్ని భాషల శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కింద సుమారు 180 కోట్ల దాకా రేటు దక్కింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను ఆర్ ఆర్ ఆర్ సినిమా బ్రేక్ చేయబోతుందని సమాచారం.
ట్రేడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అన్ని భాషలకు కలిపి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందట. అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్ కూడా స్టార్ నెట్ వర్క్ దక్కించుకుంది అని అంటున్నారు. మొత్తం మీద రేటు 200 కోట్ల కి సెట్ అయిందని అంటుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది అని చెప్పాలి.
ఈ రేంజ్ లో రేటు దక్కడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి…. రోబో 2 సీక్వెల్ కాబట్టి ఆ రేంజ్ రేటు దక్కడం ఓకే కానీ.. ఆర్ ఆర్ ఆర్ గురించి అసలు ఏమీ తెలియకుండానే ఈ రేంజ్ రేటు దక్కడం విశేషం అనే చెప్పాలి, కాగా ఈ వార్తల పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉందని అంటున్నారు.