ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హిస్టారికల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుండగా సినిమా వచ్చే ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోల ఇంట్రో టీసర్ లను రిలీజ్ చేయగా అవి రెండూ కూడా అల్టిమేట్ హిట్ అయ్యాయి.
దాంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగి పోగా ఇప్పుడు సినిమా గురించిన ఓ ఆసక్తి కరమైన న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు ల ఫీక్చనల్ కథగా వస్తున్న ఈ సినిమాలో ఓ రియల్ సాడ్ ఇన్సిడెంట్ ని జక్కన్న వాడుకోబోతున్నాడట.
స్వాతంత్ర్య ఉద్యమానికి ముఖ్య కారణాలుగా భావించే జలియన్‌వాలా బాగ్ ఇన్సిడెంట్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని కాల్చి చంపడం, అందరూ ఒక భావిలో దూకడం, తర్వాత వాళ్ళని అందరినీ చంపడం చాలా భాద కలిగించిన ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ తర్వాతే…
స్వాతంత్ర్య ఉద్యమం మరో లెవల్ కి చేరింది అని చెప్పాలి…. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా లో హీరోలు ఇద్దరూ తమ తమ ఆశయాలను నెరవేర్చడానికి ఇన్స్పిరేషన్ గా ఈ సీన్ ని వాడుకోబోతున్నాడట జక్కన్న… ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరోలు ఇద్దరూ కూడా ఉత్తేజితులై పోరాటం కొనసాగిస్తారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు… ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా…
ఒకవేళ కనుక నిజం అయితే సినిమాలో ఈ సన్నివేశం మొత్తం బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు, ఇక రాజమౌళి టేకింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది కాబట్టి సినిమా కి ఈ సీన్ మెయిన్ హైలెట్ అవుతుంది అంటున్నారు. మరి ఆ సాడ్ ఇన్సిడెంట్ ని జక్కన్న ఎలా తెరకెక్కించాడో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే…