బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా క్వాలిటీ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మధ్య మిగిలిన ఇండస్ట్రీ లను ఎదిరించే స్టేజ్ కి వచ్చేసింది, కానీ అవార్డ్ విన్నింగ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. ఒకవేళ అలా తెరకెక్కిన సినిమాలు కూడా అంచనాలను అందుకోవడం లో విఫలం అవ్వడం తో అంతగా పేరు తెచ్చుకోలేక పోతున్నాయి. ఈ విషయం లో మాత్రం తమిళ్, హిందీ మరియు మళయాళ సినిమాలు ముందున్నాయి అని చెప్పాలి.
ఇక రీసెంట్ గా ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రతీ సినిమా కి యూసర్ రేటింగ్ తో ర్యాంకింగ్స్ ఇచ్చే టాప్ వెబ్ సైట్ IMDB ( ఇంటర్నేషనల్ మూవీ డాటా బేస్ ) రీసెంట్ గా ఇండియా సినిమాల పరంగా ఆల్ టైం టాప్ 10 హైయెస్ట్ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న..
టాప్ 10 సినిమాలను అనౌన్స్ చేశారు కానీ షాకింగ్ గా ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా ఈ లిస్టులో టాప్ 10 లో చోటు దక్కించుకోలేక పోయింది. ఇక టాప్ 20 లో చూసుకున్నా మోస్ట్ పాపులర్ ఇండియన్ హిస్టారికల్ హిట్ అయిన బాహుబలి క్రేజ్ పవర్ తో 16 వ ప్లేస్ ని సొంతం చేసుకుంది.
ఒకసారి టోటల్ టాప్ 10 లిస్టు ని గమనిస్తే… 1. ఆనంద్ హిందీ, 2. దృశ్యం మలయాళం 3. URI ది సర్జికల్ స్ట్రైక్, 4. నాయకన్, 5. ఆన్బే శివం, 6. గోల్ మాల్, 7. విక్రమ్ వేదా, 8. అంధ ధూన్, 9. బ్లాక్ ఫ్రైడే, 10. రాక్షసన్… ఇవీ మొత్తం మీద టాప్ 10 సినిమాలు..
ఇలా ఒక్కో సినిమా కి ర్యాంకింగ్ వైస్ ఇవ్వడానికి యూసర్ రేటింగ్ ని ఎక్కువ గా పరిగణ లోకి తీసుకుంటారు, మన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేస్తాయి, రీసెంట్ గా మన సినిమాలు కంటెంట్ పరంగా కూడా ఆకట్టు కుంటున్నా ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే సినిమా అయితే దక్కలేదు, త్వరలోనే రావాలని కోరు కుందాం.