రెండేళ్ళ క్రితం నెలకొల్పిన రికార్డులను ఇప్పుడు బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్. రెండేళ్ళ క్రితం తన సినిమా టీసర్ సాధించిన రికార్డులు ఇప్పటికీ అలాగే ఉండగా వాటి రికార్డులు ఇతరులు ఎవ్వరూ బ్రేక్ చేయక పోవడం తో ఇప్పుడు తిరిగి తానె బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టించగా ఇప్పటికే హైయెస్ట్ లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి ఊరమాస్ అనిపించే రికార్డ్ ను సొంతం చేసుకోగా…
ఇప్పుడు వ్యూస్ పరంగా కూడా ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు విజయ్. విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే.
కాగా లైక్స్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేసిన ఈ టీసర్ ఇప్పుడు 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సర్కార్ టీసర్ నెలకొల్పిన 14.9 మిలియన్స్ ల లైక్స్ రికార్డ్ ను 17 గంటల లోనే బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను సాధించింది. దాంతో వ్యూస్ పరంగా ఇప్పుడు…
ఇండియన్ టీసర్లలో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచిన ఈ టీసర్ 17 గంటల లోనే 15 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని అందుకుని కొత్త రికార్డ్ ను సాధించగా ఇప్పుడు 24 గంటలు పూర్తీ అవ్వడానికి మరింత సమయం ఉన్న నేపధ్యంలో కచ్చితంగా… సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసే ఊపులో ఉందని చెప్పాలి. ఫ్యాన్స్ టార్గెట్ ప్రకారం….
24 గంటలు పూర్తీ అయ్యే టైం కి మినిమమ్ 20 మిలియన్స్ కి తగ్గని వ్యూస్ ని అలాగే 2 మిలియన్స్ రేంజ్ లో లైక్స్ ని అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు విజయ్ మాస్టర్ టీసర్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి ఈ టార్గెట్స్ ని కంప్లీట్ చేసి దుమ్ము దుమారం లేపుతుందో లేదో చూడాలి మరి.