Home న్యూస్ కోమాలి మూవీ రివ్యూ….హిలేరియస్ ఎంటర్ టైనర్!!

కోమాలి మూవీ రివ్యూ….హిలేరియస్ ఎంటర్ టైనర్!!

0

ఒక మనిషి గతం కోల్పోయి కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళడం లేదా గతం కోల్పోయి కొత్తగా ప్రవర్తించడం లాంటి కాన్సెప్ట్ సినిమాలు మనం చాలానే చూశాం, ఒక వ్యక్తి కోమాలోకి వెళ్లి తిరిగి రావడం లాంటి కాన్సెప్ట్ మూవీస్ కూడా చూశాం, అలాంటి కాన్సెప్ట్ ని కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన సినిమా కోమాలి, తమిళ్ లో జయం రవి కాజల్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వగా…

మంచి విజయాన్ని నమోదు చేసుకుంది, ఇక ఈ సినిమాను అప్పుడే తెలుగు లో రిలీజ్ చేయాలి అనుకున్నా లేట్ అవ్వగా రీసెంట్ గా సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ జీ 5 లో చేశారు. మరి సినిమా ఎలా ఉంది, ఎలా ఆకట్టుకుందో తెలుసు కుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే 1999 లో అనుకోకుండా తను ప్రేమించిన సంయుక్త హెగ్డే కి తన ప్రేమ గురించి చెబుతున్న టైం లో జరిగిన ఒక ఇంసిడెంట్ లో యాక్సిడెంట్ అవ్వడంతో కోమా లోకి వెళ్ళిన హీరో జయం రవి మళ్ళీ 16 ఏళ్లకి స్పృహలోకి వస్తాడు, తర్వాత ఏం జరిగింది.. లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అన్నది అసలు కథ.

పెర్ఫార్మెన్స్ పరంగా జయం రవి అద్బుతంగా నటించాడు, తన కామెడీ టైమింగ్ బాగా ఉండగా పెర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది, ఇక కాజల్ అగర్వాల్ ఉన్నంతవరకు మెప్పించాగా సంయుక్త హెగ్డే కూడా చిన్న రోల్ లో ఆకట్టుకుంది, ఇక యోగిబాబు కామెడీ… డాక్టర్ రోల్ చేసిన యాక్టర్ కామెడీ కొన్ని సీన్స్ లో కుమ్మేసింది.

విలన్ రోల్ చేసిన కె.ఎస్.రవికుమార్ కూడా మెప్పించాడు… సంగీతం పరంగా హిప్ హాప్ తమిళ అదిరిపోయే ట్యూన్స్ తో మెప్పించాడు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా కి తగ్గట్లు ఉంది, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం ప్రిడిక్ట్ చేసే విధంగానే ఉన్నప్పటికీ అవి గమనించే ఛాన్స్ లేకుండా సీన్ బై సీన్ వస్తూ ఎంటర్ టైన్ చేస్తుంది.

సినిమాటోగ్రఫీ అదిరిపోగా, తెలుగు డబ్బింగ్ బాగానే మెప్పించింది, డైలాగ్స్ కూడా బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండగా డైరెక్షన్ పరంగా ప్రదీప్ రంగనాథ్ కంప్లీట్ ఎంటర్ టైనర్ ఇవ్వాలి అని కథని పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు, కేవలం కోమా నుండి బయటికి వచ్చిన వ్యక్తికి ఎదురు అయిన పరిస్థితులు…

తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లంస్ లో ఉండటం, అది ఎలా సాల్వ్ చేశాడు అన్న పాయింట్ తో కొన్ని కొన్ని సీన్స్ ఎమోషనల్ గా బాగానే తీసినా చాలా సీన్స్ యిట్టె చెప్పే విధంగా ప్రిడిక్ట్ చేసే విధంగా తెరకెక్కించారు. అయినా కానీ చాలా సీన్స్ నవ్వు తెప్పించే విధంగా ఉండటం, సెకెండ్ ఆఫ్ లో…

డాక్టర్ రీల్ కోసం వెతికే టైం లో కామెడీ బాగా నవ్వులు తెప్పిస్తుంది, అడపాదడపా అలా కామెడీ వర్కౌట్ అయిన సీన్స్ చాలా ఉండటం తో కథలో లొసుగులు ఉన్నా కానీ చూస్తున్న 2 గంటల 10 నిమిషాల టైం లో ఎక్కువ శాతం ఎంటర్ టైన్ చేస్తూ మెప్పిస్తుంది కోమాలి సినిమా..

కామెడీ సినిమాకి లాజిక్ లు పట్టించుకోకుండా చూస్తె 2 గంటల హిలేరియస్ ఎంటర్ టైనర్ ఈ సినిమా, రివ్యూ కాబట్టి ప్లస్ అండ్ మైనస్ లు రెండూ చెప్పాలి కాబట్టి కథ బలంగా లేకపోవడం కథ యిట్టె చెప్పే విధంగా ఉండటం మేజర్ మైనస్ పాయింట్స్.. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here