Home న్యూస్ డిజిటల్ బ్లాక్ బస్టర్…కలర్ ఫోటో 50 డేస్ వ్యూస్ లెక్క తెలిస్తే షాక్!

డిజిటల్ బ్లాక్ బస్టర్…కలర్ ఫోటో 50 డేస్ వ్యూస్ లెక్క తెలిస్తే షాక్!

0

టాలీవుడ్ తరుపున డిజిటల్ రిలీజ్ అయిన సినిమాల్లో రివ్యూలు మిక్సుడ్ గా వచ్చినా ఆడియన్స్ అవేవి పట్టించుకోకుండా ఓ రేంజ్ లో ఆదరించిన సినిమా లలో ముందు నిలిచే సినిమా కలర్ ఫోటో సినిమా అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె పరిస్థితి ఎలా ఉండేదో కానీ డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలలో 50 రోజులు అవుతున్నా మంచి వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటూ దూసుకు పోతుందని సినిమా యూనిట్…

రీసెంట్ గా అనౌన్స్ చేశారు, 50 రోజుల పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక సినిమా ను కోట్లు పెట్టి కొన్న ఆహా యాప్ వాళ్లకి సినిమా ద్వారా మంచి ప్రాఫిట్ దక్కిందని సమాచారం. సినిమా ఫస్ట్ డే నే 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని, వీకెండ్ కి వచ్చే సరికి 3 లక్షల 45 వేల వ్యూస్ ని సొంతం చేసుకోగా…

మొదటి వారం పూర్తీ అయ్యే సమయానికి 6 లక్షల 10 వేల దాకా వ్యూస్ ని 10 రోజులకు గాను సినిమా 7 లక్షల మార్క్ ని 2 వీక్స్ కి వచ్చే సరికి సినిమా 7 లక్షల 40 వేల యూనిక్ వ్యూస్ ని సాధించగా 25 రోజులకు గాను ఓవరాల్ గా మరో 45 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందట ఈ సినిమా…

దాంతో 25 రోజులకు టోటల్ గా 7 లక్షల 85 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 25 రోజుల నుండి 50 రోజుల టైం లో మొత్తం మీద 60 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సాధించగా టోటల్ 50 రోజుల వ్యూస్ కౌంట్ ఇప్పుడు 8 లక్షల 45 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సాధించినట్లు సమాచారం… ఇక ఈ వ్యూస్ కి గాను సినిమా కి ఎంతవరకు…

కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి అన్నది గమనిస్తే… ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటు తో 8 లక్షల 45 వేల వ్యూస్ కి 4.22 కోట్ల దాకా రెవెన్యూ వచ్చి ఉండ వచ్చని అంచనా వేయవచ్చు. అంటే ఆహా యాప్ వాళ్ళు పెట్టిన 3 కోట్ల రేటుకి 1.2 కోట్లకు పైగా ప్రాఫిట్ ని 50 రోజుల్లో సొంతం చేసుకుని సత్తా చాటుకుంది కలర్ ఫోటో సినిమా.. నిజంగా డిజిటల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here