రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన మరో కొత్త సినిమా మర్డర్…. మిర్యాలగూడలో జరిగిన రియల్ ఇంసిడెంట్ నుండి ప్రేరణ గా తీసుకుని కథని అల్లుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ను ఆనంద్ చంద్ర డైరెక్షన్ లో తెరకేక్కించగా అనేక వివాదాల తర్వాత ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది, సినిమా కథ పాయింట్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకునే తండ్రి…
అమ్మాయి తనకి నచ్చని అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తో ఎలా రియాక్ట్ అయ్యాడు, ఎలాంటి పని చేశాడు అన్నది కథ… టీవీ లో మనం మొత్తం భాదితురాలి పాయింట్ ఆఫ్ వ్యూ ని అసలు జరిగిన విషయాన్నీ తెలుసుకుంటే… ఈ కథలో ఆ కథని తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ ని చెప్పాడు…
పెర్ఫార్మెన్స్ బాగున్నా సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, అక్కడక్కడా విన్న ఊహాగానాలు తనకి నచ్చిన విధంగా తెరకెక్కించారు… శ్రీకాంత్ అయ్యంగర్ పెర్ఫార్మెన్స్ పరంగా అదుర్స్ అనిపించగా మిగిలినవాళ్ళు ఓకే అనిపించుకున్నారు. జస్ట్ యావరేజ్ అనిపించే విధంగా సినిమా ఉండగా…
24 న రిలీజ్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 100 నుండి 110 వరకు థియేటర్స్ ని సొంతం చేసుకోగా మొదటి రోజు 3.5 లక్షల షేర్ ని వసూల్ చేయగా మొత్తం మీద 4 రోజుల వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 8-10 లక్షల మధ్యలో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్నట్లు సమాచారం… సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఎంతకు అమ్మారు లాంటి వివరాలు ఏవి బయటికి రాలేదు కానీ మాగ్జిమం పెర్సేంటేజ్ బేస్ మీదే సినిమాను రిలీజ్ చేశారని టాక్ వినిపిస్తుంది, బిజినెస్ పై మరింత క్లారిటీ వచ్చాక సినిమా సాధించిన కలెక్షన్స్ ఫుల్ కలెక్షన్స్ ని బిజినెస్ అండ్ బడ్జెట్ డీటైల్స్ ని అప్ డేట్ చేస్తాం. ప్రస్తుతం స్లో అయిన సినిమా త్వరలో పరుగు పూర్తీ చేసుకునే అవకాశం ఉంది.