ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ రెడ్…. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తడం సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సమ్మర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా డైరెక్ట్ రిలీజ్ కి అద్బుతమైన ఆఫర్లు వచ్చినా కానీ నో చెప్పిన రామ్ థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పి…
ఇప్పుడు చెప్పినట్లే ఈ నెల 14 న సంక్రాంతి కానుకగా రెడ్ మూవీ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా సంక్రాంతి మూవీస్ లో హైయెస్ట్ బిజినెస్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాగా రెడ్ మూవీ సంచలనం సృష్టించడం విశేషం…
సినిమాకి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన బిజినెస్ ను గమనిస్తే… నైజాం లో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న రెడ్ మూవీ సీడెడ్ లో 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా టోటల్ ఆంధ్రాలో 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.
దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, అది కూడా సంక్రాంతి భారీ పోటి లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమా. రామ్ ఇస్మార్ట్ శంకర్ సాధించిన ఊరమాస్ విజయం వలెనే ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందని అంచనా వేయవచ్చు. కానీ పోటి తీవ్రంగా ఉండటం తో సోలో రిలీజ్ అయ్యి ఉంటె బాగుండేదని…
అనిపిస్తున్నా కానీ… ఇది వరకు సంక్రాంతి రిలీజ్ లు అన్నీ ఇలా పోటి లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నేపధ్యంలో కమర్షియల్ మూవీ అయిన రెడ్ కి హిట్ అయ్యే అవకాశం గట్టిగానే ఉందని చెప్పొచ్చు. ఆల్ రెడీ సూపర్ హిట్ మూవీ రీమేక్ కాబట్టి ఇక్కడ కూడా అలాంటి టాక్ వస్తే ఈ కలెక్షన్స్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.