మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా 4 రోజుల ఓపెన్ గ్రౌండ్ లో వస్తున్న సినిమా కి ఎలాంటి పోటి లేదు కాబట్టి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మెల్లి మెల్లిగా పెరుగుతూ వెళుతున్నాయి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ కౌంట్ కూడా భారీ లెవల్ లో ఉండే అవకాశం ఉంది. ఒక్క నైజాం ఏరియా లోనే లేటెస్ట్ కౌంట్ ఏకంగా 278 వరకు వెళ్ళింది అంటే రవితేజ మాస్…
ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఫైనల్ కౌంట్ రిలీజ్ రోజు నాటికి మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంది, ఆల్ మోస్ట్ 9 నెలలుగా మూత బడి ఉన్న 90% థియేటర్స్ ఇప్పుడు రీ ఓపెన్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో…
మొత్తం మీద 800 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇది నిజంగానే ఊరమాస్ అని చెప్పాలి, ఇది వరకు రవితేజ నటించిన కిక్ 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 850 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. మళ్ళీ అలాంటి రిలీజ్ రవితేజ సినిమాలకు దక్కలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ క్రాక్ సినిమా కి ఆ రేంజ్ లో థియేటర్స్ కౌంట్…
దక్కే అవకాశం పుష్కలంగా ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఉంది, తెలుగు రాష్ట్రాలలో కూడా ఆక్యుపెన్సీ 100% పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అది నిజం అయితే సంక్రాంతికి కలెక్షన్స్ జాతర ఖాయమని చెప్పొచ్చు. ఫైనల్ కౌంట్ ఎంత అవుతుందో చూడాలి మరి.