ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ ది ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై సాలిడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో సంక్రాంతి రేసులో నిలిచిన అన్ని సినిమాలలోకి హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టార్గెట్ పరంగా పోటి లో కూడా ఇప్పుడు ఈ బ్రేక్ ఈవెన్ ని అందుకునే సత్తా ఉన్న సినిమాగా బరిలోకి దిగుతుంది.
ఇక సినిమా ద్వారా మొత్తం మీద నిర్మాతకి సాలిడ్ ప్రాఫిట్ దక్కింది అని చెప్పాలి. సినిమాను ముందు డిజిటల్ రిలీజ్ చేయాలి అనుకున్నా రామ్ ఎట్టి పరిస్థితులలో కూడా వద్దని చెప్పి థియేటర్స్ లోనే సంక్రాంతి బరిలో నిలిపి సాలిడ్ బిజినెస్ జరిగేలా చూశాడు.
మొత్తం మీద సినిమా బడ్జెట్ 23 కోట్ల రేంజ్ లో ఉండగా రెడ్ మూవీ తెలుగు శాటిలైట్ రైట్స్ ని 8.5 కోట్లకు అమ్మగా అలాగే డిజిటల్ రైట్స్ ని 5 కోట్లకు అమ్మారు, దాంతో ఈ రెండు కలిపే ఏకంగా 13.5 కోట్లు రికవరీ అవ్వగా ఇప్పుడు…. ఈ సినిమా కి 8.5 కోట్ల రేటు….
హిందీ డబ్బింగ్ రైట్స్ కింద సొంతం అయ్యింది అని సమాచారం. దాంతో ఓవరాల్ గా బిజినెస్ ఇప్పుడు 22 కోట్ల రేంజ్ లో జరిగింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా మరో కోటి బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా మ్యూజిక్ రైట్స్ అండ్ ఇతర రైట్స్ కింద కోటి దాకా దక్కినట్లు సమాచారం.
దాంతో టోటల్ బిజినెస్ ఇప్పుడు 39 కోట్ల రేంజ్ లో జరగగా టోటల్ బడ్జెట్ 23 కోట్లు అవ్వగా సినిమా బడ్జెట్ మీద ఇప్పుడు 16 కోట్ల ప్రాఫిట్ ను నిర్మాతకి దక్కేలా చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 16.5 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా ఎంతవరకు లాభాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.