మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ సెన్సేషన్ క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ వీక్ ని అల్టిమేట్ కలెక్షన్స్ తో ముగించింది, మొదటి వారం లోనే అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని 5 రోజుల్లోనే సొంతం చేసుకోవడం తో తర్వాత పరుగు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఏమాత్రం జోరు తగ్గకుండా చూసుకుని…
పరుగును సాలిడ్ గా కొనసాగించి హిట్ నుండి సూపర్ హిట్ గా మారింది సినిమా. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు చాలినన్ని థియేటర్స్ ఇవ్వక పోవడం తో కలెక్షన్స్ తగ్గినా కానీ 8 వ రోజు మళ్ళీ రెట్టించిన జోరుతో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా..
రెండు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్లకు పైగా కలెక్షన్స్ మినిమమ్ అనుకుంటే థియేటర్స్ షోలు పెరగడం తో కలెక్షన్స్ పెరిగి 2.21 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 86L
👉Ceeded: 36L
👉UA: 23L
👉East: 19L
👉West: 16L
👉Guntur: 15L
👉Krishna: 14.2L
👉Nellore: 12L
AP-TG Total:- 2.21CR (3.61Cr Gross~)
ఇక సినిమా టోటల్ గా 8 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.99Cr
👉Ceeded: 4.21Cr
👉UA: 2.78Cr
👉East: 2.09Cr
👉West: 1.74Cr
👉Guntur: 1.94Cr
👉Krishna: 1.62Cr
👉Nellore: 1.28Cr
AP-TG Total:- 23.64CR (39Cr Gross~)
KA+ROI: 1.22Cr(Updated)
OS: 65L (Updated)
Total: 25.51Cr(42Cr~ Gross) (Updated)
ఇదీ మొత్తం మీద క్రాక్ సినిమా 8 రోజుల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్… కర్ణాటక లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు క్లియర్ గా ఇప్పుడు బయటికి వచ్చాయి. ఆ అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 25 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది.
సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 17 కోట్లకు అమ్మగా సినిమా 17.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పుడు 8 రోజుల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో 8.01 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ ని ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ టాగ్ ని సొంతం చేసుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.