కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా మొదటి వారంలోనే ఆల్ మోస్ట్ బిజినెస్ మార్క్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది, కానీ సినిమా రిలీజ్ రోజున టీం మొత్తం కూడా ఇదే విధంగా షేక్ షేక్ అయ్యారు…
దానికి కారణం సినిమాలో చాలా సీన్స్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడమే, రిలీజ్ కి రెండు రోజుల ముందు ఇలా కీలక సీన్స్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడం తో టీం మొత్తం ఎం చేయని పరిస్థితిలో ఉండగా ఫ్యాన్స్ తో పాటు అందరూ సినిమా కి సపోర్ట్ గా నిలిచారు.
ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వడం తో ఆ లీక్ చేసింది ఎవరో కనిపెట్టారు టీం… ఆ వివరాల లోకి వెళితే… మూవీ ఓవర్సీస్ రిలీజ్ ల కోసం డిజిటల్ ప్రింట్లను విదేశాలకు పంపినందుకు మేకర్స్ ఒక ప్రైవేట్ డిజిటల్ కంపెనీకి ఫుటేజ్ అందించారు. ఆ సంస్థకు చెందిన ఒక ఎంప్లాయ్ ఈ చిత్రం థియేటర్లలోకి రాకముందే…
చాలా సీన్స్ ని లీక్ చేశాడట… దాంతో ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న టీం, లీక్ చేసిన వ్యక్తీ తో పాటు కంపెనీ పై కూడా కేసు వేశారని సమాచారం…సినిమా లీక్స్ కి కారకుడిపై ఈ చిత్ర నిర్మాతలు కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఫుటేజీని లీక్ చేసిన ఉద్యోగిపైనా పరిహారంగా ఏకంగా 25 కోట్లు దావా వేస్తున్నారట. ఇప్పటికే సదరు డిజిటల్ సంస్థకు .. లీకు బాబుకు లీగల్ నోటీసు పంపారని సమాచారం…
ఇలా లీక్ చేసే వాళ్లకి ఇలాంటి షాక్ ఇచ్చే రేంజ్ ఫైన్స్ వేస్తె తప్ప సినిమాలను లీక్ చేయడం మానరని, వీళ్ళకి ఇదే కరెక్ట్ అని అనేవాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఈ అవరోధాలను సినిమా ఎదురుకుని నిలబడింది కాబట్టి సరిపోయింది లేకుంటే పరిస్థితి కష్టంగా ఉండేదని చెప్పొచ్చు. ఇక ఆ ఫైన్ ఎప్పటి వరకు కడతారో తెలియాల్సి ఉంది..