బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 5 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమా జాంబి రెడ్డి, టాలీవుడ్ లోనే కాదు ఇండియా లో కూడా మొట్ట మొదటి ఫుల్ లెంత్ జాంబి నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది, అది కూడా కంప్లీట్ కమర్షియల్ యాంగిల్ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి వస్తున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సినిమా పై కూడా…
ఆడియన్స్ లో ఆసక్తి బాగానే పెరిగి పోయింది… ఇక సినిమా పోస్టర్ లు అండ్ సాంగ్స్ ఒక్కోటి గా రిలీజ్ అవుతూ మరింత మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు సినిమా కి అది బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాంటేజ్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉండగా…
సినిమా కి ఇక్కడతో పాటు హిందీ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. సౌత్ మూవీస్ ని హిందీ డబ్బింగ్ చేసి అక్కడ యూట్యూబ్ లో టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తూ వస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా విషయం లో కూడా అదే జరగగా…
సినిమా హిందీ డబ్బింగ్ బిజినెస్ సాలిడ్ రేటు ను సొంతం చేసుకుంది, బహుశా సినిమా బడ్జెట్ మొత్తాన్ని ఈ ఒక్క బిజినెస్ తోనే రికవరీ చేసే రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న జాంబి రెడ్డి మొత్తం మీద హిందీ డబ్బింగ్ రైట్స్ దృశ్యా 2.2 కోట్ల రేటు ను సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. చిన్న సినిమా కి ఈ రేంజ్ రేటు సొంతం అవ్వడం అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా మంచి బజ్ తోనే ప్రేక్షకుల ముందుకు ఫిబ్రవరి 5 న రిలీజ్ కానుంది. మరి టాలీవుడ్ ఆడియన్స్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూడని ఈ జాంబిలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో అః మరియు కల్కీ ఫేం ప్రశాంత్ వర్మా ఎంతవరకు మెప్పించగలుగుతాడో చూడాలి మరి…