Home న్యూస్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా…టోటల్ థియేటర్స్ కౌంట్, బుకింగ్స్ రిపోర్ట్, ఫస్ట్ డే ఎంత రావొచ్చు…ఈ...

30 రోజుల్లో ప్రేమించడం ఎలా…టోటల్ థియేటర్స్ కౌంట్, బుకింగ్స్ రిపోర్ట్, ఫస్ట్ డే ఎంత రావొచ్చు…ఈ టికెట్ హైక్స్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు అమృతా అయ్యర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అయ్యింది, సినిమా ఒక్క పాటతో పాపులారిటీని సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ పాపులారిటీ హెల్ప్ తోనే రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ బిజినెస్ ను రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

4.4 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే….నైజాం లో ఈ సినిమా 179 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సీడెడ్ లో సినిమా…

70 థియేటర్స్ రిలీజ్ కానుండగా టోటల్ ఆంధ్రా లో సినిమా 200 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను దక్కించుకోబోతుంది, దాంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే సినిమా ఏకంగా 450 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 520 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు మూడు రోజుల ముందు నుండే మొదలు అయినా ఫుల్లుగా రిలీజ్ రోజు టైం కే మొదలు కానుంది, సినిమా బుకింగ్స్ కూడా చాలా స్లోగా ఉండటం తో సినిమా ఇప్పుడు మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఉంది, ఇక సినిమా కి టికెట్ హైక్స్ పెట్టారు. పండగ టైం లో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా టికెట్ హైక్స్ అంటే లాభమేమో కానీ ఎదురుదెబ్బే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని సినిమా పై ఉన్న బజ్ ని బట్టి చూస్తుంటే సినిమా 30 – 40 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుంటే మంచి ఓపెనింగ్స్ గా పరిగణలోకి తీసుకోవచ్చు. మరి టాక్ ఎలా ఉంటుందో అన్న దానిపై సినిమా గ్రోత్ ని బట్టి ఈ లెక్క పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here