బాక్స్ ఆఫీస్ దగ్గర యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా కి కామన్ ఆడియన్స్ లో టాక్ కొంచం మిక్సుడ్ గానే ఉన్నప్పటికీ కూడా సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం ఆ ఇంపాక్ట్ అయితే ఏమాత్రం కనిపించడం లేదనే చెప్పాలి. సినిమా మొదటి రోజే అంచనాలను మించి కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.
ఇక రెండో రోజు కూడా సినిమా ఏమాత్రం జోరు తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి సత్తా చాటుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొత్తం మీద 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేసినపట్టికీ కూడా…
ఆ అంచనాలను మించేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 96 లక్షల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఒకసారి ఆ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 33L
👉Ceeded: 17L
👉UA: 11L
👉East: 8L
👉West: 7L
👉Guntur: 8L
👉Krishna: 6.4L
👉Nellore: 5.6L
AP-TG Total:- 0.96CR (1.6Cr Gross~)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 97L
👉Ceeded: 41L
👉UA: 28L
👉East: 22L
👉West: 20L
👉Guntur: 27L
👉Krishna: 16L
👉Nellore: 14L
AP-TG Total:- 2.65CR (4.33Cr Gross~)
Ka+ ROI – 12L(Updated)
OS – 9L
Total WW: 2.86Cr(4.72Cr~ Gross)
ఇదీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4.4 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా..
సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.8 కోట్లు కాగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.94 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా ఈ టార్గెట్ ని ఇప్పుడు మొదటి వారంలో అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.