ప్రతీ సినిమా హిట్ అవ్వాలని రూల్ లేదు, ప్రతీ కథ అందరికీ నచ్చాలని కూడా రూల్ లేదు, ఒక హీరో కి నచ్చిన కథ మరో హీరోకి నచ్చక పోవచ్చు, ఒక హీరో మిస్ చేసుకున్న సినిమా మరో హీరో చేసి ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలాంటివి టాలీవుడ్ లో అనేకం జరగగా రీసెంట్ గా టాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న చిన్న సినిమా…
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మరీ టాక్ పరంగా ఫుల్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోకున్నా కానీ, మిక్సుడ్ టాక్ తోనే సినిమా కి కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గా వస్తూ ఉండటం తో ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ గా మారింది ఈ సినిమా.. అలాంటి ఈ సినిమాను…
మొత్తం మీద 3 హీరోలు మిస్ చేసుకున్నారు, వాళ్ళు మిస్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు ఈ సినిమాను ఒప్పుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర హీరోగా మొదటి హిట్ ని సాలిడ్ గా సొంతం చేసుకున్నాడు. మొత్తం మీద ఈ సినిమాను…
డైరెక్టర్ మున్నా అందరికన్నా ముందు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి వినిపించగా కథ పాయింట్ లో కొన్ని మార్పులను చెప్పగా అవి సెట్ కాకపోవడం తో అల్లు శిరీష్ కి కథని సజెస్ట్ చేశారట. తర్వాత అల్లు శిరీష్ ఈ కథ ని విని తనకి ఈ కథ సెట్ కాదని రిజక్ట్ చేయగా సినిమా టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ దగ్గరకు వెళ్ళింది. సత్యదేవ్ కథని ఓకే చేసినా కానీ ఇతర సినిమాల షూటింగ్స్ వలన…
సినిమా డిలే అవ్వగా ఈ లోపు యాంకర్ ప్రదీప్ సీన్ లోకి రావడంతో సత్యదేవ్ సినిమా నుండి తప్పుకున్నారు. ఇలా మొత్తం మీద ముగ్గురు హీరోల దగ్గర నుండి కథ మారుతూ చివరికి ప్రదీప్ దగ్గ్గరకు రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తోనే తనకి మంచి లాంచ్ పాడ్ గా నిలిచి సూపర్ హిట్ ని ప్రదీప్ కి దక్కేలా చేసింది.