బాక్స్ ఆఫీస్ దగ్గర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సెన్సేషనల్ మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది… సినిమా రిలీజ్ అయ్యాక మిక్సుడ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద 5 రోజుల పాటు నాన్ స్టాప్ గా రోజుకి…
మినిమమ్ 50 లక్షల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగించి, 6 మరియు 7 వ రోజుల్లో మాత్రం కొంచం స్లో డౌన్ అయింది. ముఖ్యంగా 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమా స్లో డౌన్ అవ్వగా ఇక రెండో వారంలో కొత్త సినిమాలు భారీగా…
ఉండటంతో థియేటర్స్ ని భారీగానే తగ్గించుకుంది. ఇక సినిమా ఓవరాల్ గా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచి మంచి ప్రాఫిట్ ని సైతం సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. మొత్తం మీద సినిమా 7 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.99Cr
👉Ceeded: 1.21Cr
👉UA: 79L
👉East: 47L
👉West: 38L
👉Guntur: 52L
👉Krishna: 44L
👉Nellore: 28L
AP-TG Total:- 6.08CR(10.35Cr Gross~)
Ka+ ROI – 20L(Updated)
OS – 21L
Total WW: 6.49Cr(11.25Cr~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ లెక్క. రిలీజ్ కి ముందు 4.4 కోట్ల బిజినెస్ 4.8 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ చూసి సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్న డౌట్ వచ్చినప్పటికీ సినిమా మిక్సుడ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర…
బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడమే కాకుండా మొదటి వారం మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ తో 1.69 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా రెండో వారం థియేటర్స్ చాలా కోల్పోగా..రెండో వారం ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. మొత్తం మీద మంచి లాభాలతో సినిమా పరుగును ముగించే అవకాశం ఉంది…