బాక్స్ ఆఫీస్ దగ్గర యాంకర్ ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి 4-5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని దక్కించుకుని దుమ్ము లేపి ప్రాఫిట్స్ ని కూడా దక్కించుకుంది. కానీ తర్వాత నుండి సినిమా స్లో డౌన్ అవుతూ వచ్చింది, ఎలాగోలా మొదటి వారం సాలిడ్ కలెక్షన్స్ తో ముగించిన ఈ సినిమా అప్పటికే లాభాలను సొంతం చేసుకుంది.
ఇక రెండో వారంలో జాంబి రెడ్డి మరియు ఇతర సినిమాల కారణంగా ఈ సినిమా థియేటర్స్ ని చాలా వరకు తగ్గించారు, దాంతో అది బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఇంపాక్ట్ చూపింది, కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయాయి. సినిమా మొదటి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా…
6.49 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది, ఇక రెండో వారానికి వచ్చే సరికి సినిమా ఉన్న థియేటర్స్ సంఖ్య 150 రేంజ్ లో ఉండగా ఆ థియేటర్స్ లో మొత్తం మీద కేవలం 56 లక్షల రేంజ్ షేర్ ని మాత్రమే సినిమా సొంతం చేసుకుంది, సినిమా మొత్తం మీద 2 వారాలలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.11Cr
👉Ceeded: 1.32Cr
👉UA: 85L
👉East: 52L
👉West: 40L
👉Guntur: 58L
👉Krishna: 49L
👉Nellore: 29L
AP-TG Total:- 6.56CR(11.30Cr Gross~)
Ka+ ROI – 23L(Updated)
OS – 26L
Total WW: 7.05Cr(12.35Cr~ Gross)
ఇదీ మొత్తం మీద 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్… 2 వ వారం లో సాలిడ్ దెబ్బ తగిలినా కానీ మొదటి వారంలోనే సినిమా సేఫ్ అవ్వడం తో పెద్దగా ఎఫెక్ట్ ఏమి పడలేదు ఈ సినిమా కి.. సినిమా ను టోటల్ గా 4.4 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక రెండు వారాలను పూర్తీ చేసుకున్న తర్వాత సినిమా మొత్తం మీద 2.25 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా 2.5 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి అందుకుంటుందో లేదో చూడాలి…