అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ నాంది ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రాగా సినిమా గురించిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా సినిమా కి అయిన బడ్జెట్ ఈ సారి కొంచం రెగ్యులర్ అల్లరి నరేష్ మూవీస్ కన్నా కూడా కొంచం ఎక్కువే అయిందని సమాచారం. రెగ్యులర్ అల్లరి నరేష్ మూవీస్ 3 కోట్ల రేంజ్ లో సింపుల్ గా నిర్మాణం అవుతూ ఉంటాయి… కానీ నాంది సినిమా విషయనికి వచ్చే సరికి మాత్రం….
ఈ సినిమా ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందింది అంటున్నారు. లేట్ అవ్వడంతో వడ్డీలు కలుపుకుని ఇంత బడ్జెట్ అయిందని సమాచారం. కాగా సినిమా ను ముందు ఆల్ మోస్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు కూడా. సినిమాకి ఏకంగా 8 కోట్ల రేంజ్ లో…
డిజిటల్ రిలీజ్ ఆఫర్ దక్కింది. అంటే సినిమా బడ్జెట్ కన్నా కూడా కోటి ఎక్కువ ఆఫర్… కానీ ఎందుకనో సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న అల్లరి నరేష్ మాత్రం సినిమాను ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా సినిమా థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద…
2.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించగా, శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ కలుపుకుని 5 కోట్ల బిజినెస్ చేసిందట ఈ సినిమా. ఇక హిందీ డబ్బింగ్ రేటు ఫిక్స్ అవ్వాల్సి ఉండగా థియేటర్స్ లో లాభాలు వస్తే షేర్ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కన సినిమా కి పెట్టిన బడ్జెట్ ఆల్ రెడీ బిజినెస్ తో రికవరీ అవ్వగా మైనర్ ప్రాఫిట్ ని ఆల్ రెడీ సొంతం చేసుకుంది ఈ సినిమా…
హిందీ డబ్బింగ్ రైట్స్ కి డీసెంట్ రేటు వచ్చినా ప్రాఫిట్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం లో అల్లరి నరేష్ మాట నిజం అయ్యి సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా అంచనాలను అందుకుని అల్లరి నరేష్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలవాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు.