టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు మార్కెట్ కోసం ప్రతీ ఇండస్ట్రీ హీరో ట్రై చేస్తున్నారు, ఆల్ రెడీ మార్కెట్ ఉన్నవాళ్ళు సేఫ్ కానీ కొత్తగా ట్రై చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు, వారిలో కన్నడ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగు మార్కెట్ కోసం ఫుల్ ప్రిపేర్ అవుతున్నారు. టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కి మ్యాచ్ అయ్యే స్టొరీ అనిపిస్తే చాలు సినిమా ను ఇక్కడ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు… కమర్షియల్ మూవీ మోస్ట్ లవుడ్ అండ్…
మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫార్ములా అయిన ఈ కాన్సెప్ట్ తో ఇప్పుడు వరుస పెట్టి కన్నడ మూవీస్ తెలుగు లో రిలీజ్ కాబోతు ఉండగా ఇప్పుడు అక్కడ టాప్ స్టార్స్ లో ఒకరైన దర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబర్ట్ ని తెలుగు లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయగా…
అనౌన్స్ మెంట్ తర్వాత వెంటనే 400 థియేటర్స్ మినిమమ్ ఇవ్వాలి అంటూ కామెంట్స్ చేయడానికి దానికి మనవాళ్ళు నో చెప్పడం తర్వాత తెలుగు సినిమాలను ఇక్కడ ఆడనివ్వం లాంటి కామెంట్స్ చేయడం జరగగా తర్వాత ఫస్ట్ క్రేజ్ తెప్పించుకొండి థియేటర్స్ అవే వస్తాయి అంటూ మన వాళ్ళు చెప్పగా…
రాబర్ట్ యూనిట్ టీసర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా రెండింటికి తెలుగు లో మంచి క్రేజ్ లభించింది, మాస్ ఎలిమెంట్స్ కమర్షియల్ మూవీ కి కావాల్సిన హంగులు ఉండటంతో ఇప్పుడు మినిమమ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కి థియేటర్స్ కేటాయించే పనిలో పడ్డారు. కాగా రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా కి తెలుగు లో…
రికార్డ్ లెవల్ థియేటర్స్ కేటాయించబోతున్నాం అంటూ కామెంట్స్ చేశారు, కానీ ఆ రోజు 3 తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి కాబట్టి మరీ రికార్డ్ లెవల్ లో కాకున్నా టీం అడిగిన విధంగా 400 థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు ట్రేడ్ లో టాక్ ఉంది, రిలీజ్ టైం కి ఇంకా హైప్ పెరిగితే ఈ లెక్క పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు..