Home గాసిప్స్ 2007-08 లో వచ్చిన ఆ 2 మూవీస్ చేసి ఉంటే…ఇప్పుడు నేను స్టార్ హీరో అయ్యే...

2007-08 లో వచ్చిన ఆ 2 మూవీస్ చేసి ఉంటే…ఇప్పుడు నేను స్టార్ హీరో అయ్యే వాడిని!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ ఇక్కడలో చాలా అవకాశాలే అందుకున్నాడు. సందీప్ నటించిన 25 వ సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.. కొన్నేళ్ల కిందటి వరకు అతడి పరిస్థితి బాగానే ఉంది కానీ.. ఈ మధ్య వరుసగా ఎదురు దెబ్బలు తగిలి కథానాయకుడిగా బాగా వెనుకబడిపోయాడు సందీప్. ఐతే తన కెరీర్లో రెండు మంచి అవకాశాలు మిస్సయిపోయానని.. అవి చేసి ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదని అంటున్నాడు సందీప్.

ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు 2007, 08 టైం లో వచ్చిన హ్యాపీడేస్ మరియు అష్టాచెమ్మా సినిమాలు. ఈ రెండు సినిమాలకూ సందీప్ ఆడిషన్స్ కు వెళ్లాడట. తన టాలెంట్ కూడా చూపించాడట. ఆల్ మోస్ట్ సెలెక్ట్ కూడా అయినా కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల తాను ఆ సినిమాలు చేయలేకపోయానని అతను చెప్పాడు. ‘హ్యాపీడేస్’

హ్యాపీడేస్ సినిమాలో నాలుగు పాత్రలకూ సందీప్ ను ట్రై చేసి చూశారట. అన్నీ బాగానే ఉన్నా చివరికి నిఖిల్ సిద్ధార్థ్ చేసిన రాజేష్ పాత్రకు సందీప్ ఓకే అయ్యాడట. కానీ ఆ పాత్రకు తెలంగాణ యాసలో డైలాగులు చెప్పాల్సి రావడం, సందీప్ కు ఆ స్లాంగ్ రాక పోవడంతో చివరి నిమిషంలో సందీప్ ని తప్పించాడట శేఖర్ కమ్ముల. ఈ విషయంలో సందీప్ కు సారీ కూడా చెప్పాడట.

ఇక నాని- అవసరాల శ్రీనివాస్ కాంబో లో సూపర్ హిట్ అయిన ‘అష్టాచెమ్మా’ విషయానికి వస్తే.. ఇంద్రగంటి మోహనకృష్ణ కి సందీప్ టాలెంట్ నచ్చినప్పటికీ అతడికి తగ్గ పాత్ర లేకపోవడంతో ఈ సినిమాకు తీసుకోలేదట. హీరో పాత్రకు సందీప్ సూటయ్యేట్లు ఉన్నప్పటికీ అప్పటికే నానిని సెలక్ట్ చేసి ఉండటంతో కుదర్లేదట. ఇక రెండో పాత్ర అయిన అవసరాల శ్రీనివాస్ పాత్రకు

నువ్వు సూటవ్వవు అంటూ సందీప్ కు నో చెప్పాడట ఇంద్రగంటి. ఈ విధంగా ఆ 2 సినిమాలూ తాను మిస్సయినట్లు అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతో ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకడిని అయ్యే వాడిని అని చెప్పాడట. రీసెంట్ గా సందీప్ కిషన్  కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా A1 ఎక్స్ ప్రెస్ సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమా టాక్ అయితే బాగుంది కానీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here