ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా ను వేరే భాష లో రీమేక్ చేయడం అన్నది సర్వ సాధారమైన విషయమే… కానీ అదే సినిమా ఆల్ రెడీ డబ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత కూడా రీమేక్ చేయడం అన్నది మాత్రం చాలా కొత్త విషయం అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఇది వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ్ లో సూపర్ హిట్ అయిన అజిత్ కుమార్ నటించిన వీరం సినిమా తెలుగు లో…
వీరుడొక్కడే పేరుతో డబ్ అయినా మళ్ళీ 1.2 కోట్ల రేటు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకుని కాటమరాయుడు పేరు తో రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత ఒకే చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన అప్ కమింగ్ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ నటించిన లూసిఫర్ రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇదే సినిమా తెలుగు లో ఆల్ రెడీ ముందే డబ్ అయ్యి రిలీజ్ కూడా అయ్యింది, అయినా కానీ పెద్దగా ఆడక పోవడం తో మెగాస్టార్ కి బాగా సూట్ అవుతుందని రీమేక్ చేయాలనీ ఫిక్స్ అవ్వగా రీమేక్ రైట్స్ ని కొనుకున్నారట.. ఈ సినిమా కి రీమేక్ రైట్స్ కింద…
సుమారు 1.7 కోట్ల రేటు చెల్లించారని సమాచారం, దాంతో ఆల్ రెడీ డబ్ అయ్యి మళ్ళీ రీమేక్ అయిన సినిమాలలో ఎక్కువ రేటు పలికిన సినిమా గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ రీమేక్ ని కూడా రామ్ చరణ్ నిర్మించ బోతుండగా డైరెక్షన్ పనులను ధృవ ఒరిజినల్ డైరెక్టర్ మోహన్ రాజా తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కథ లోచాలా మార్పులు చేర్పులు చేయగా ఎలివేషన్ సీన్స్ ని మరింతగా పెంచారని సమాచారం…
చిరు ప్రస్తుతం ఆచార్య సినిమా తో బిజీ గా ఉండగా ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్ల బోతున్నాడని సమాచారం. ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు… మరి ఈ సినిమా రిజల్ట్ కాటమరాయుడు లా అవుతుందా లేదా తెలుగులో కుమ్ముతుందో చూడాలి…