Home న్యూస్ రాబర్ట్ తెలుగు టాక్ ఏంటి…హిట్టా…ఫట్టా!!

రాబర్ట్ తెలుగు టాక్ ఏంటి…హిట్టా…ఫట్టా!!

0

కన్నడ నుండి తెలుగు లో భారీ పోటి లో రిలీజ్ అయిన సినిమా రాబర్ట్, భారీ పోటి లో రావడంతో సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది, కలెక్షన్స్ ఎలా వస్తాయి అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ… వారణాసిలో తన కొడుకు తో ప్రశాంతంగా ఉండే హీరో, క్యాటరింగ్ పని చేసే హీరో లైఫ్ సాఫీగా సాగుతూ ఉండగా అనుకోకుండా విలన్స్ తన లైఫ్ లోకి రావడంతో…

హీరో ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది, అసలు హీరో ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇలా తన ఐడెంటిటీ దాచి ఎందుకు ఉంటున్నాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే, ఈ కథ పాయింట్ వింటుంటే మన తెలుగు లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు ఇంద్ర ఇలా అనేక సినిమాలు గుర్తు రాక మానవు…

ఈ సినిమా కూడా అదే కోవలోకి వచ్చే కథ, కొంచం ట్రీట్ మెంట్ మార్చి, అక్కడక్కడా రీసెంట్ గా తమిళ్ లో వచ్చిన వేదాలం, తెరీ సినిమాల మిక్స్ కూడా చేసి తీసిన రోటిన్ కమర్షియల్ రివేంజ్ స్టొరీ… ఇలాంటి కథలు మనం చూసి చూసి ఉన్నాం, మళ్ళీ అదే కథతో వచ్చిన ఈ సినిమా పార్టు పార్టులుగా మెప్పించింది,

హీరోయిజం సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ సీన్ సెకెండ్ ఆఫ్ లో హీరోయిజం సీన్స్ అలా అక్కడక్కడా కొన్ని సీన్స్ మెప్పించినా మిగిలిన సినిమా మొత్తం కథ రొటీన్ రొట్ట. తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది యిట్టె చెప్పగలం, అసలు ఇలాంటి కథలకు కాలం ఎప్పుడో చెల్లిపోయింది, ఇక ఇలాంటి కథలో జగపతిబాబు, రవికిషోర్, రవి శంకర్ విలనిజం ఇంకా పరమ రొటీన్…

అయినా కానీ మాస్ ఆడియన్స్ ను కొద్ది వరకు మెప్పించే అవకాశం ఉన్న సినిమా సినిమాటోగ్రఫీ బాగుండటం, ప్రొడక్షన్ వాల్యూస్, ముందే చెప్పినట్లు హీరోయిజం సీన్స్ మెప్పించడంతో పర్వాలేదు అనిపించే విధంగా అనిపించింది, ఈ వీకెండ్ లో అన్ని సినిమాలు చూసి బోర్ ఫీల్ అయితే ఈ సినిమా కి వెళ్ళొచ్చు, కొంచం లెంత్ ఎక్కువ ఉన్నా, రొటీన్ స్టొరీనే అయినా పార్టు పార్టులుగా సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది, సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here