స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నది ప్రతీ ఒక్కరికీ చాలా ముఖ్యమైనది, కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు చెప్పిన కథ తమకి సెట్ అవుతుందా, బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుందా లేదా అని అంచనా వేయగల వాళ్ళు కొద్ది మందే ఉంటారు. కొందరు కథ చెప్పేటప్పుడు మెప్పించినా తెరకెక్కించే టైం లో చేతులు ఎత్తేస్తారు అనుకోండి అది వేరే విషయం బట్ చాలా వరకు కథ ల పరంగా జడ్జిమెంట్ బాగున్న హీరోల్లో….
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ చరణ్ కూడా ఒకరు అనే చెప్పాలి. కెరీర్ లో కొన్ని సినిమాలు మాత్రమె అంచనాలను తప్పగా చాలా వరకు సినిమాలు అంచనాలను అందుకున్నాయి. ఇక రామ్ చరణ్ కొత్త కథలు ఎప్పటి కప్పుడు వింటూనే ఉంటారు కానీ వాటి గురించి బయట ఓకే అయితే తప్పితే పెద్దగా…
న్యూసులు బయటికి రావు, కానీ రీసెంట్ గా రామ్ చరణ్ దగ్గరకు వచ్చి రామ్ చరణ్ నో చెప్పిన ఓ నాలుగు సినిమాల గురించి న్యూస్ బయటికి వచ్చింది. ఆ న్యూస్ ప్రకారం రామ్ చరణ్ నో చెప్పిన నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత బాగా ఆకట్టుకోలేక పోయాయి.
వాటిలో ముందుగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమా ఉండగా ఈ కథని రిజల్ట్ చేసిన రామ్ చరణ్ తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో ఓకే బంగారం కథని రిజెక్ట్ చేశాడు. తెలుగు లో వర్కౌట్ అవ్వదని నో చెప్పగా సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. తర్వాత మేర్లపాక గాంధీ చెప్పిన కృష్ణార్జున యుద్ధం కథ ఫస్ట్ రామ్ చరణ్ కే వెళ్ళగా ఆ కథకి కూడా నో చెప్పాడట.
తర్వాత సోగ్గాడే చిన్నినాయన ఫేం కళ్యాణ్ కృష్ణ చేసిన నేల టికెట్ కథ రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళగా ఆ కథ కూడా తనకి సెట్ కాదని నో చెప్పాడట. ఇలా రామ్ చరణ్ నో చెప్పిన ఈ సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ఆ విషయం లో రామ్ చరణ్ స్టొరీ సెలెక్షన్స్ చాలా వరకు నిజం అయ్యిందని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అలాగే RC16 సినిమాలతో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇయర్ ఎండ్ లో గేమ్ చేంజర్ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.