బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క వారంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏప్రిల్ మొదటి వారం నుండి సెకెండ్ వేవ్ మెల్లి మెల్లిగా పెరిగి పోతూ ఉండగా వకీల్ సాబ్ రిలీజ్ టైం కి మరింత గట్టిగా పెరగడం స్టార్ట్ అయింది, కానీ ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ ఎప్పటి నుండో ఈ మూవీ కోసం ఎదురు చూస్తూ ఉండటం తో ఇవేవి పట్టించుకోకుండా మొదటి వారంలో విరగబడి వకీల్ సాబ్ కి వెళ్ళారు. మధ్యలో వర్కింగ్ డేస్ లో…
స్లో అయినా వీకెండ్ లో అలాగే మొదటి వారంలో వచ్చిన సెలవుల్లో దుమ్ము లేపిన వకీల్ సాబ్ అనేక అవరోధాలను ఎదురుకుని కూడా దుమ్ము లేపింది, కానీ ఈ వారం లో కేసుల సంఖ్య 130K నుండి ఇప్పుడు 270K కి పైగా పెరిగిపోయాయి.
దాంతో సెకెండ్ వీకెండ్ లో కొత్త పాత అని తేడా లేకుండా అన్ని సినిమాలు స్లో డౌన్ అయ్యాయి. ఈ వారంలో చిన్నా చితకా సినిమాలు 4 రిలీజ్ అయినా జనాలు వాటిని అస్సలు పట్టించుకొనే లేదు. నాలుగుకి నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఔట్ అయ్యిపోయాయి.
అదే సమయం లో వకీల్ సాబ్ కూడా స్లో అయినప్పటికీ 10 వ రోజు ఆంధ్రలో కొన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం విశేషం, పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నప్పటికీ వకీల్ సాబ్ వాటిని తట్టుకుని మిగిలిన మూవీస్ కన్నా వకీల్ సాబ్ జనాలను థియేటర్స్ కి రప్పిస్తుంది…. కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన చాలా చోట్ల మాత్రం ఆక్యుపెన్సీ చాలా వరకు తగ్గిపోయింది. కానీ సినిమాకి… ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్…
నెల ఎండ్ వరకు కూడా నోటబుల్ మూవీస్ ఏవి లేవు, బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటి వరకు థియేటర్స్ లో సినిమా చూడాలి అంటే వకీల్ సాబ్ ఒక్కటే ఆప్షన్ కాబట్టి కలెక్షన్స్ తగ్గినా లాంగ్ రన్ సినిమా కి ఉండే అవకాశం ఉంది. కానీ కేసులు ఇలానే పెరిగితే షరతులు మరింత కటినం అయ్యే అవకాశం ఉంది. మరి మొత్తం మీద లాంగ్ రన్ ఎలా ఉంటుందో చూడాలి..